పాత పెన్షన్‌ విధానంపునరుద్ధరించాలి | - | Sakshi
Sakshi News home page

పాత పెన్షన్‌ విధానంపునరుద్ధరించాలి

Aug 12 2026 12:22 AM | Updated on Aug 12 2026 12:22 AM

కరీంనగర్‌ అర్బన్‌: పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధ్ధరించాలని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక టీఎన్జీవో భవన్‌లో ఎగ్జి క్యూటివ్‌ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు స్పష్టమైన పెన్షన్‌ భద్రత కల్పించాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలన్నారు.టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణ్‌ రావు, కోశాధికారి కిరణ్‌ కుమార్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు రాగి శ్రీనివాస్‌, సర్దార్‌ హర్మీందర్‌ సింగ్‌, గూడ ప్రభాకర్‌ రెడ్డి, నగర అధ్యక్షుడు మారుపాక రాజేశ్‌ భరద్వాజ్‌, పోలు కిషన్‌, మహిళా చైర్మన్‌ ఇరుమల్ల శారద, సునీత, సరిత, సుస్మిత పాల్గొన్నారు.

సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్త

వీణవంక: ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని, సీజనల్‌ వ్యాధుల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో రాజగోపా ల్‌ సూచించారు. మండలంలోని చల్లూరు, వీణవంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంగళవారం తనిఖీ చేశారు. హాజరు, అవుట్‌ పేషెంట్‌ రిజిస్టర్‌, పిల్లల వ్యాధి నిరోధక టీకాలను పరిశీలించారు. వైద్యులు సంతోష్‌, వరుణ, బియాబాని, సబ్‌యూనిట్‌ ఉన్నారు.

కౌన్సిల్‌ నిర్వహించని వారిపై చర్య తీసుకోవాలి

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని మాజీ మేయర్‌, 58వ డివిజన్‌ కార్పొరేటర్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం మున్సిపల్‌ పరిపాలనశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. ప్రతి నెల సమావేశం నిర్వహించాల్సి ఉన్నప్పటికి, గత మూడు నెలలుగా ఏర్పాటు చేయడం లేదన్నారు. నిబంధనల ప్రకారం కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించి సంబంధించిన వివరాలు కలెక్టర్‌కు పంపించాల్సి ఉంటుందన్నారు. నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.

13న లోలెవెల్‌లో నీటి సరఫరాకు అంతరాయం

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ఫిల్టర్‌బెడ్‌లో మరమ్మతులతో ఈ నెల 13వ తేదీన నగరంలోని లో లెవెల్‌ జోన్‌ పరిధిలో తాగునీటి సరఫరా ఉండదని నగరపాలకసంస్థ ఈఈ లచ్చిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిల్టర్‌బెడ్‌లోని 150 హెచ్‌పీ, 350హెచ్‌పీ పంప్‌ హౌస్‌లో మరమ్మతులు జరుగుతున్నాయని తెలిపారు. గురువారం తాగునీటి సరఫరా ఉండదు కాబట్టి, లో లెవెల్‌ జోన్‌ పరిధిలోని డివిజన్‌ల వాసులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

పవర్‌ కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి: విద్యుత్‌ లైన్ల నిర్వహణతో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కె.వీ.సీసీ ఫీడర్‌ పరిధిలోని ముకరంపుర, కలెక్టర్‌ ఆఫీస్‌, బస్టాండ్‌, 1వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌, భగత్‌నగర్‌, పీఎఫ్‌ ఆఫీస్‌ ప్రాంతాలు, ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 11 కె.వీ.అల్కాపురి ఫీడర్‌ పరిధి లోని కోతిరాంపూర్‌, గిద్ద పెరుమాళ్ల గుడి, భవానీనగర్‌ ప్రాంతాలతో పాటు మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు 11 కె.వీ.ఉజ్వల పార్కు పరిధిలోని శ్రద్ధా ఇన్‌ హోటల్‌, ఎన్‌టీఆర్‌ విగ్రహం, డిమార్ట్‌, బైపాస్‌ రోడ్డు, పాలిటెక్నిక్‌ కాలేజీ, ఐటీఐ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.

రేకుర్తి, బావుపేటలో

విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు11 కె.వీ. రేకుర్తి సమ్మక్క గద్దెలు ఫీడర్‌ పరిధిలోని సమ్మక్క గద్దెలు, విజయపురి కాలనీ, స్వామికా లనీ, షేకాబ్‌ కాలనీ, ఇంద్రమ్మ కాలనీ, ఐ హా స్పిటల్‌, మైత్రివనం, బుడిగె జంగాల కాలనీ, అంజనేయులు కాలనీ ప్రాంతాలతో పాటు 33/11 కె.వీ. ఆసిఫ్‌నగర్‌, బావుపేట సబ్‌స్టేషన్‌ నిర్వహణ పనులు చేపడుతున్నందున ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఆసిఫ్‌నగర్‌, ఆసిఫ్‌నగర్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా, ఎలగందల్‌, ఎలగందల్‌ ఇండస్ట్రియల్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్‌ రూరల్‌ ఏడీఈ గాదం రఘు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement