ప్యాకింగ్ యంత్రం
స్క్రబ్బర్ ప్యాకింగ్ కవర్లు
జగిత్యాలకు చెందిన ఓ మహిళ.. ఇన్‌స్ట్రాగాంలో పార్ట్‌టైం ఉద్యోగాలు, ఎంఎక్స్‌వో కంపెనీ పేరిట వర్క్ ఫ్రం హోం అంటూ ప్రకటన చూసింది. విజ యవాడలోని కొందరు తాము స్క్రబ్బర్లు ప్యాకింగ్ చేయిస్తామని, మెటీరియల్ ఇస్తామని, ఇంటి వద్ద ఉండి పనిచేసుకుంటే నెలకు రూ.24వేలు ఇస్తామని చెప్పారు. ప్యాకింగ్ మెటీరియల్ కోసం రూ.1.50 లక్షలు చెల్లించింది. నెలనెలా ఠంఛనుగా రూ.24వేలు రావడంతో కరీంనగర్, గోదావరిఖనిలతో ఉండే తన బంధువులు, స్నేహితులకు చెప్పడంతో వారూ చేరారు. ఇలా వందలాది మంది స్కీంలో చేరారు. ఈ స్కీములో చేరిన వారికి ఒక ప్యాకింగ్ మెషీన్, కొన్ని స్క్రబ్బర్ల షీట్లు, ప్యాకింగ్ కవర్లు ఇచ్చారు. వీటిని ప్యాకింగ్ చేసిన తరువాత స్థానికంగా సదరు కంపెనీ నియమించుకున్న డిస్ట్రిబ్యూటర్లు వచ్చి సామగ్రిని కలెక్ట్‌చేసి తీసుకెళ్లేవారు. ఈ క్రమంలో పెద్దపల్లి నుంచి 30 మంది, కరీంనగర్ నుంచి 57 మంది, జగిత్యాలలో 52 మంది మహిళలు ఈ స్కీములో చేరారు.


