● కిసాన్‌నగర్ ఘటనతో పార్టీకి సంబంధమే లేదు ● బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్‌రావు
కరీంనగర్: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వ్యక్తిగత గొడవలను బీజేపీకి అంటగట్టడం దుర్మార్గమని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు మండిపడ్డారు. మంగళవారం నగరంలో మాట్లాడుతూ బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణును గతంలో కారుతో ఢీకొట్టి దాడిచేసినా, తాము ఎవరిపైనా ఆరోపణలు చేయలేదని స్పష్టం చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెబుతున్న గంగుల కమలాకర్ వ్యక్తిగత కక్షలు, దాడులను తమ పార్టీపై రుద్దడం మానుకోవాలని హెచ్చరించారు. కిసాన్ నగర్ ఘటనను బీజేపీ పార్టీకి అంటగడ్డి రాజకీయ పబ్బం గడుపుకోవడం మంచిదికాదన్నారు. ఈ విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పేరును వాడటం సిగ్గుచేటన్నారు. బీజేపీ కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, ఒంటెల సత్యనారాయణరెడ్డి, చొప్పరి జయశ్రీ, గణేశ్, పొన్నం మొండయ్య వేణు, చంద్ర పాల్గొన్నారు.


