అయోమయంగా ఉంది | - | Sakshi
Sakshi News home page

అయోమయంగా ఉంది

Jul 3 2026 11:56 PM | Updated on Jul 3 2026 11:56 PM

మాది వేములవాడలోని సాయినగర్‌. 1985 నుంచి ఇక్కడే ఉంటున్నాం. ప్రస్తుతం సర్‌(ఎస్‌ఐఆర్‌)తో తలనొప్పిగా ఉంది. 2002 ఓటర్ల జాబితాలో నాది(సాబీర్‌) పేరు మాత్రమే ఉందని ఒకే ఫామ్‌ ఇచ్చారు. నా కొడుకు(ఫైసల్‌) పేరు లేదని ఫామ్‌ ఇవ్వలేదు. మరో బీఎల్‌ఏ వద్ద ఉందంటున్నారు. వాళ్లని అడిగితే సరైన సమాధానం లేదు.

– సాబీర్‌, ఫైసల్‌ పాషా, వేములవాడ

ఫామ్‌ నింపడం ఇబ్బంది

ఎస్‌ఐఆర్‌లో ఫామ్‌ ఇచ్చి వివరాలు నింపాలని చెప్పారు. అందులో 2002కు సంబంధించిన ఓటర్‌ కార్డు లేదా ఏదైనా గుర్తింపు పత్రం ఉండాలని చెబుతున్నారు. ఫామ్‌లో వివరాలు నింపడం ఇబ్బందిగా ఉంది. ఎన్యూమరేటర్లు సహకరించాలి. లేకుంటే చాలా ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉంది.

– బొడ్డు రాజలింగం, బోయినపల్లి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement