పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా పా లకుర్తి మండలం ఈసాలత క్కళ్లపల్లి గ్రామశివారులో గు రువారం రాత్రి బైక్ ఢీకొని ముంజాల రాజయ్య(50) మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఈసాలతక్కళ్లపల్లికి చెందిన రాజయ్య ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ కార్మికుడు. గురువారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా.. రైస్‌మిల్లు స మీపంలో ఎదురుగా వచ్చిన బైక్ వేగంగా ఢీకొ ట్టింది. రాజయ్యకు తీవ్రగాయాలు కాగా పెద ్ద
పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తర లించారు. పరిస్థితి విషమించి అక్కడ మృతిచెందాడు. మృతుడికి భార్య రాజేశ్వరి, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వీరిలో ఒక కూతురు వికలాంగురాలు. పెద్దదిక్కును కోల్పోయిన ఆ కు టుంబసభ్యులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. బసంత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, రాజయ్య మృతికి కారకుడైన ఎండీ రజాక్ రూ.4లక్షల పరిహారం చెల్లించేందుకు అంగీకరించినట్లు స్థానికులు తెలిపారు.
క్వారీలో సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి
కొత్తపల్లి(కరీంనగర్)/ఇల్లంతకుంట(మానకొండూర్): కొత్తపల్లి మండలం కమాన్‌పూర్ శివారులోని ఎస్‌ఎల్‌పీజీ గ్రానైట్ క్వారీలో సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి చెందాడు. కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్‌పేటకు చెందిన మామిడి పర్శరాం(46) ఎస్‌ఐఎస్ సెక్యూరిటీ కంపెనీ ద్వారా కమాన్‌పూర్‌లోని ఎస్‌ఎల్‌వీజీ గ్రానైట్ క్వారీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ప్రతి రోజు మాదిరిగానే గురువారం రాత్రి విధులకు హాజరైన ఆయన ఉదయం మరో సెక్యూరిటీ గార్డు విధులకు వచ్చి చూసే సరికి చనిపోయి ఉన్నాడు. ఈ విషయాన్ని క్వారీ సూపర్‌వైజర్ హనుమంతు ద్వారా మృతుడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడి భార్య అనారోగ్యంతో రాకపోవడంతో బావమరిది నరేందర్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం కొత్తపల్లికి చెందిన చేగొండ స్వామి(53) ఆర్థిక ఇబ్బందులతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలం క్రితం మృతుడి భార్య లావణ్యను బర్రె ఢీకొట్టడంతో కాలికి గాయమైంది. వైద్యా నికి ఖర్చు కావడం, భార్య ఆరోగ్యంగా లేకపోవడంతో స్వామి మద్యానికి బానిసయ్యాడు. మనస్థాపానికి గురై ఉరి వేసుకున్నాడని రూరల్ ఎస్సై మధుకర్ తెలిపారు.
జువెల్లరీ దోపిడీ కేసులో పోలీసు కస్టడీకి ఇద్దరు
కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లో సంచలనం సృష్టించిన పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో నింది తులైన యాదవ్ అలియాస్ జైనుల్ అబుద్ధీన్, ఆదిల్‌ఖాన్‌ను పోలీసులు శుక్రవారం నుంచి మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. కోర్టు అ నుమతితో నిందితులను కస్టడీకి తీసుకున్న ద ర్యాప్తు అధికారులు, దోపిడీకి సంబంధించిన కీలకాంశాలపై విచారిస్తున్నారు. నిందితుల కస్టడీ ఆదివారం ముగుస్తుండడంతో సోమవారం తిరిగి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.


