కరీంనగర్: అనస్తీషియాలజీ అనేది ఆపరేషన్ థియేటర్‌కే పరిమితం కాదని, అత్యవసర వైద్యం, క్రిటికల్ కేర్, పెయిన్ మేనేజ్‌మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాల్లో అత్యంత కీలకమని రాష్ట్ర అనస్తీషియా సంఘం అధ్యక్షుడు డాక్టర్ దేవులపల్లి ప్రవీణ్‌కుమార్ అన్నారు. శిశు శస్త్రచికిత్సల నుంచి గుండె, మెదడు, ఆర్థోపెడిక్, గైనకాలజీ వంటి అన్ని రకాల ఆపరేషన్లలో రోగి జీవక్రియలను ని యంత్రిస్తూ భద్రత కల్పించే బాధ్యత వీరిదేనన్నా రు. మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్యులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవా లని సూచించారు. శుక్రవారం కరీంనగర్‌లోని ఐఎంఏ హాల్‌లో రాష్ట్రస్థాయి అనస్తీషియాలజిస్టుల సద స్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. నగరంలో పలు ఆస్పత్రులలో లైవ్ సర్జరీలతో ఈ సదస్సు ప్రారంభమైంది. ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎనమల్ల నరేశ్ మాట్లాడుతూ.. ‘విజిలెన్స్– ఇన్నోవేషన్– పేషెంట్ సెంటర్డ్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్’ప్రధానాంశంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాంప్రదాయ ఉపన్యాసాలకు భిన్నంగా నగరంలోని రె నీ, సన్‌రైజ్, ప్రతిమ, చల్మెడ ఆస్పత్రుల్లో ఏకకాలంలో ఐదు ప్రత్యేక వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేశామన్నా రు. మెకానికల్ వెంటిలేషన్, క్రిటికల్ కేర్, హీమోడైనమిక్ మానిటరింగ్, అల్ట్రాసౌండ్ గైడెడ్ రీజినల్ నర్వ్ బ్లాక్స్‌తో పాటు కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంపై జాతీయ, రాష్ట్ర స్థాయి నిపుణులు వైద్యులకు ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. ఈ వర్క్‌షాప్ ల్లో 250మంది పీజీ వైద్యులు పాల్గొన్నారు. కాగా, ఈ సదస్సుకు స్పాట్ రిజిస్ట్రేషన్లతో కలిపి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలి పారు. ముఖ్య అతిథిగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కె.రమేశ్‌రెడ్డి, గౌరవ అతిథులుగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రతిమ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ బోయినపల్లి హరిణి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.తకీయుద్దీన్‌ఖాన్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనసరి శ్రీరామ్ హాజరుకానున్నారని తెలిపారు. సంఘం తెలంగాణ కార్యదర్శి బి.వెంకటేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.మహేశ్వర్‌రెడ్డి, ట్రెజరర్ టి.ఓంప్రసాద్, కరీంనగర్ అధ్యక్షుడు బి.వినయ్‌కుమార్, సైంటిఫిక్ కమిటీ చైర్మన్ నిఖిల్ ముద్గల్కర్, కార్యదర్శి పి.వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
అత్యవసర వైద్యంలోనూ కీలకం
ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
రాష్ట్ర అనస్తీషియా సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్
కరీంనగర్‌లో రాష్ట్రస్థాయి సదస్సు, వర్క్‌షాప్‌లు


