ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ శివారులోని శ్రీ మల్లికార్జునస్వామి, రేణుకా ఎల్లమ్మ, హనుమాన్ ఆలయాల్లో గురువారం రాత్రి గుర్తు గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. గ్రామ శివారులో ఒకే కాంపౌండ్‌లో ఉన్న ఈ మూడు ఆలయాల్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయాల చుట్టూ ఉన్న మూడు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి లోనికి ప్రవేశించారు. మల్లికార్జున స్వామి ఆలయంలోని అమ్మవారి పుస్తెమట్టెలతోపాటు హుండీలోని నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఆలయాల్లో దొంగలు పడడం ఇది మూడోసారి. మూడు సీసీ కెమెరాలు పగులగొట్టగా మరో సీసీ కెమెరాలో దొంగతనం దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసుల దొంగల కోసం గాలిస్తున్నారు. యాదవ సంఘం అధ్యక్షుడు సోనవేని రాజయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపారు.
పోలీసుల తనిఖీలు
అల్మాస్‌పూర్ శివారులోని మూడు ఆలయాల్లో దొంగతనం జరిగిన నేపథ్యంలో మండల కేంద్రంతోపాటు వీర్నపల్లి రోడ్డు, రాగట్లపల్లి, రాచర్ల గొల్లపల్లి వద్ద వాహన తనిఖీలు చేశారు. అనుమానితులను ఆపి వివరాలు సేకరించారు. నంబర్‌ప్లేట్ లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
గాలిస్తున్న పోలీసులు


