బీఆర్‌ఎస్‌ హయాంలోనే చేనేత సంక్షేమం | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ హయాంలోనే చేనేత సంక్షేమం

Jul 3 2026 11:50 PM | Updated on Jul 3 2026 11:50 PM

బీఆర్‌ఎస్‌ హయాంలోనే చేనేత సంక్షేమం పీజీ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల ఆగస్టు 31వరకు చేపల వేట నిషేధం మత్స్యకారులకు రాయితీపై వాహనాలు

కొత్తపల్లి: కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే చేనేత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశామని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. కొత్తపల్లి చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకా రోత్సవానికి శుక్రవారం ముఖ్యఅతిథిగా హాజ రయ్యారు. తెలంగాణలో చేనేత కార్మికులను ఆదుకున్న ఏకై క ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ అన్నా రు. 17,18 డివిజన్ల కార్పొరేటర్లు వేముల కవి త, వాసాల రమేశ్‌, సంఘం అధ్యక్షుడు మునీందర్‌, ఉపాధ్యక్షుడు చంద్రమౌళి పాల్గొన్నారు.

ఈవీఎం గోదాం ఆకస్మిక తనిఖీ

కరీంనగర్‌ అర్బన్‌: ఈవీఏం గోడౌన్‌ను అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టరేట్‌ వెనుకాల గల గోడౌన్‌ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గనిర్ధేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్‌ గోదాంను తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గోదాం వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. ఈవీఎం గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరీంనగర్‌ అర్బన్‌ తహసీల్దార్‌ ఎన్‌.రాజేశ్‌ వివిధ పార్టీల ప్రతినిధులు మడుపు మోహన్‌, నాంపల్లి శ్రీనివాస్‌, సత్తినేని శ్రీనివాస్‌, మజీద్‌ హుమైన్‌ సయ్యద్‌ ఇబ్రహీం, ఎర్రవెల్లి రవీందర్‌, నరేష్‌, సిరిసిల్ల అంజయ్య పాల్గొన్నారు.

కరీంనగర్‌సిటీ: ఎస్సారార్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ సైన్స్‌ కళాశాల పీజీ మొదటి, మూడో సెమిస్టర్‌ ఫలి తాలను శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్‌ కల్వ కుంట రామకృష్ణ, కళాశాల కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ తిరుకోవెల శ్రీనివాస్‌ విడుదల చేశారు. ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ పీజీ మొదటి సెమిస్టర్‌లో 233మంది పరీక్షలు రాయగా 213 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. మూడో సెమిస్టర్‌లో 246మందికి 215 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. వెబ్‌సైట్‌లో తమ ఫలితాలు చూసుకోవచ్చన్నారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ నితిన్‌ పాఠక్‌ టి.రాజయ్య, టీజీసీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, అదనపు పరీక్షల ని యంత్రణాధికారి ఎం.మల్లారెడ్డి పాల్గొన్నారు.

కరీంనగర్‌ అర్బన్‌: రిజర్వాయర్లు, చెరువుల్లో ఆగస్టు 31వరకు చేపల వేట నిషేధమని జిల్లా మత్స్యశాఖ అధికారి విజయభారతి స్పష్టం చేశారు. ఈ కాల పరిమితిలో తల్లి చేపలు సహజంగా ప్రేరణ పొంది కోట్ల సంఖ్యలో సంతానోత్పత్తి జరుగుతుందని వివరించారు. అందువల్ల ఈ నెల 1నుంచి చేపల వేటను నిషేధించామని లైసెన్స్‌దారులు, మత్స్యకారులు చేపలు, రొయ్యలు పట్టవద్దని వెల్లడించారు. ఒకవేళ నిబంధనను విస్మరించి, చేపల వేట చేపడితే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు.

కరీంనగర్‌ అర్బన్‌: మత్స్యకారులకు రాయితీపై వాహనాలను ఇవ్వనున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి విజయభారతి తెలిపారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా చేపలు, చేప ఆధారిత ఉత్పత్తుల విక్రయానికి రెండు సంచార చేపల అమ్మక వాహనాలను కేటాయించినట్లు వివరించారు. సదరు యూనిట్లను 40శాతం రాయితీపై ఇవ్వనున్నామని, ఆసక్తిగల మత్స్యకారులు ఈ నెల 18లోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. చేపల అమ్మకంలో అనుభవం, స్వయం సహాయక సంఘంలో సభ్యులై ఉండాలని, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలని తెలిపారు. రూ.10లక్షల విలువ గల వాహనం 40శాతం రాయితీతో వస్తుందని వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement