బెల్ట్‌ దుకాణాలపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

బెల్ట్‌ దుకాణాలపై ఉక్కుపాదం

Jul 3 2026 11:50 PM | Updated on Jul 3 2026 11:50 PM

● ఎలబోతారంలో మద్యం విక్రయిస్తే రూ.60 వేల జరిమానా

కరీంనగర్‌రూరల్‌: మద్యపాన నిషేధం దిశగా కరీంనగర్‌ మండలం ఎలబోతారం గ్రామపంచాయతీ అడుగులేస్తోంది. ఈనెల ఒకటో తేదీ నుంచి గ్రామంలోని మద్యం బెల్ట్‌షాపులపై నిషేధం విధించారు. ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ.60వేల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. ఎలబోతారంలో నాలుగు బెల్ట్‌షాపులున్నాయి. నగునూరు, తీగలగుట్టపల్లిలోని మద్యం దుకాణాల నుంచి స్టాక్‌ తీసుకొస్తుంటారు. రాత్రిపగలు తేడాలేకుండా విక్రయిస్తున్నారు. కొందరు ఆరుబయట సిట్టింగ్‌లు నిర్వహిస్తుండటంతో అర్ధరాత్రివరకు మద్యం ప్రియుల రాకపోకలు, గొడవలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు భర్తలు తాగి వచ్చి భార్యలను కొట్టడం, యువకులు గొడవలకు దిగడంతో ప్రశాంత వాతావరణం కో ల్పోయిందనే ఉద్దేశంతో సర్పంచ్‌ తప్పట్ల రాజు బెల్ట్‌షాపులపై నిషేధం ప్రకటించారు. బుధవారం నుంచి బెల్ట్‌ దుకాణాలు మూసివేయాలని ఉపసర్పంచ్‌ గోపాల్‌, వార్డుసభ్యులతో చర్చించి నిర్ణయించారు. నలుగురు బెల్ట్‌షాపు నిర్వాహకులకు ఇక నుంచి గ్రామంలో మద్యం విక్రయించరాదని, ఒకవేళ అమ్మినట్లయితే రూ.60వేల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. విక్రయించినవారిని పట్టించినవారికి రూ.2వేల నగదు బహుమతి ప్రకటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement