‘కాళేశ్వరం’ మరమ్మతు ఏమైంది? | - | Sakshi
Sakshi News home page

‘కాళేశ్వరం’ మరమ్మతు ఏమైంది?

Jul 3 2026 11:50 PM | Updated on Jul 3 2026 11:50 PM

● బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు

మానకొండూర్‌: కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు మరమ్మతు చేయడం లేదో చెప్పాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావును బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విజయరమణరావు మాజీ మంత్రి హరీశ్‌రావుపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మానకొండూర్‌లో శుక్రవారం మాట్లాడుతూ విజయరమణరావు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఏంటో తెలుసుకోవాలని సూచించారు. ఘోష్‌ కమిషన్‌ నివేదికపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఉత్తర్వులను పూర్తిగా చదివి మాట్లాడాలని హితవు పలికారు. కేటీఆర్‌, హరీశ్‌ బీఆర్‌ఎస్‌కు రెండు కళ్లలాంటి వారని, చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, జూపల్లి కృష్ణారావు సవాల్‌ విసిరి తోక ముడిచారన్నారు. బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు తాళ్లపల్లి శేఖర్‌గౌడ్‌, శాతరాజు యాదగిరి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement