ప్రభుత్వ కళాశాలకు జై | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కళాశాలకు జై

Jul 3 2026 2:04 AM | Updated on Jul 3 2026 2:04 AM

ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక దృష్టి

కమాన్‌పూర్‌(మంథని): పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండలంలోని గుండారం (కమాన్‌పూర్‌) ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పడిన నాటి నుంచి ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తుండటంతో విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఈ కళాశాలలో చేర్పించేందుకు ముందుకొస్తున్నారు. ఈ ఏడాది కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో 90 మంది బాలురు, 63 మంది బాలికలు అడ్మిషన్లు తీసుకున్నారు.

జిల్లా, రాష్ట్రస్థాయిలో ర్యాంకులు

గుండారం (కమాన్‌పూర్‌) ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటైన నాటి నుంచి ప్రతీ విద్యా సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధిస్తోంది. పలుమార్లు జిల్లా, రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించిన సందర్భాలున్నాయి. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ఇక్కడ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన డిజిటల్‌ విద్యా బోధన, కంప్యూటర్‌ ల్యాబ్‌, ఎఫ్‌సెట్‌, నీట్‌ క్లాస్‌లు, విశాలమైన భవనం, రెగ్యూలర్‌ ఉపాధ్యాయులతో అత్యత్తమైన విద్యా బోధనను అందిస్తున్నారు. ఈనేపథ్యంలో విద్యార్థులు ప్రైవేటు కళాశాలల వైపు చూడకుండా ప్రతీ ఎడాది ఈ ప్రభుత్వ కళాశాలలో చేర్పించడానికి ముందుకు వచ్చి అడ్మిషన్లు తీసుకొని వివిధ కోర్సుల్లో చేరుతున్నారు. ఈ ఏడాది అడ్మిషన్లలో జిల్లాలోనే ప్రథమ స్థానం, ఉమ్మడి జిల్లాలో నాల్గో స్థానంలో నిలిచింది.

కమాన్‌పూర్‌ కళాశాలలో 152 అడ్మిషన్లు

జిల్లాలో ప్రథమ, ఉమ్మడి జిల్లాలో నాల్గో స్థానం

ఆసక్తి చూపిస్తున్న విద్యార్థులు

విద్యార్థులకు అనుజ్ఞులైన రెగ్యూలర్‌ ఉపాధ్యాయులతో విద్యా బోధన చేస్తున్నాం. ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. డిజిటల్‌ క్లాస్‌లు, కళాశాలలో నీట్‌, ఎపసెట్‌ క్లాస్‌లు నిర్వహిస్తున్నాం.

– కాశిమల్ల సుధాకర్‌ ప్రిన్సిపాల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement