భూ వివాదంలో దాడి | - | Sakshi
Sakshi News home page

భూ వివాదంలో దాడి

Jul 3 2026 2:04 AM | Updated on Jul 3 2026 2:04 AM

ట్రాక్టర్‌ను బావిలో పడేసిన వైనం

చందుర్తి(వేములవాడ): అన్నదమ్ముల మధ్య వివాదంలో ఉన్న భూమిలో ట్రాక్టర్‌తో దున్నుతున్న వ్యక్తిపై తమ్ముడు దాడి చేశాడు. అంతేకాకుండా ఆ ట్రాక్టర్‌ను వ్యవసాయబావిలో పడేసిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు. చందుర్తి మండల కేంద్రానికి చెందిన మార్త మల్లేశం, మార్త లక్ష్మీరాజం అన్నదమ్ములు. వీరి మధ్య నాలుగేళ్లుగా తల్లిదండ్రుల ఆస్తి పంపకాల్లో పంచాయితీలు కొనసాగుతున్నాయి. వివాదంలో ఉన్న భూమిలో అన్న మల్లేశం గురువారం ట్రాక్టర్‌తో దున్నించాడు. గమనించిన తమ్ముడు ట్రాక్టర్‌తో దున్నేందుకు వచ్చిన మేడిశెట్టి శంకర్‌కు, తమ్ముడు లక్ష్మీరాజం పరస్పరం దాడి చేసుకున్నారు. అంతేకాకుండా అన్న మల్లేశంను దూషించి, దాడి చేశాడు. ట్రాక్టర్‌ను వ్యవసాయ బావిలో పడేశాడు. ఈమేరకు అన్న మల్లేశం ఫిర్యాదుతో తమ్ముడు మార్త లక్ష్మీరాజంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ ప్రమోద్‌రావు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement