● బంగారం, వెండి ఆభరణాలు అపహరణ
ధర్మపురి: కుటుంబమంతా పైఅంతస్తులో నిద్రిస్తుండగా కింది అంతస్తులో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారం, వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన ఘటన ధర్మపురిలో గురువారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు కథనం ప్రకారం.. పట్టణంలోని హన్మాన్‌వాడకు చెందిన రాపర్తి నారాయణ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం రాత్రి ఇంటి పైఅంతస్తులో పడుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కింది అంతస్తులోని గదిలోకి చొరబడి కప్‌బోర్డు పగులగొట్టి రెండు తులాల బంగారం, పది తులాల వెండి గొలుసులు, రూ.15వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై మహేశ్ ఘటన స్థలానికి చేరుకుని ఆరా తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.


