పల్లె ఆత్మను ఆవిష్కరించిన ‘సీతక్క బంగుల’ | - | Sakshi
Sakshi News home page

పల్లె ఆత్మను ఆవిష్కరించిన ‘సీతక్క బంగుల’

Jul 3 2026 2:04 AM | Updated on Jul 3 2026 2:04 AM

సిరిసిల్ల: ఉద్యమాల ఖిల్లా సిరిసిల్ల. నిత్య చైతన్యానికి ప్రతీక. ఇక్కడి మట్టి పరిమళాలను, చెట్టూ... పుట్టను.. కళ్లారా చూసిన ఆ యువకుడు పల్లెను.. ఆ పల్లె ఆత్మను ఆవిష్కరించేందుకు సిడ్నీ(ఆస్ట్రేలియా)లో ఉంటూ కలలు కన్నాడు. ఆ కలలను నిజం చేసేందుకు ‘సీతక్క బంగుల’ ఓ ఆటో డ్రైవర్‌ ప్రేమకథ పేరుతో పాటను చిత్రీకరించాడు. సిరిసిల్ల ప్రాంతమే అందుకు వేదికై ంది. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన సుతారి మధుకర్‌(మ్యాడీ సీడ్నీ) ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. తను పుట్టి పెరిగిన నేలను, తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని శాశ్వతం చేసేందుకు జానపదాన్ని ఆవిష్కరించారు. గ్రామీణ వాతావరణాన్ని, తెలంగాణ పల్లెను ఆత్మీయ బంధాలను పొందుపరుస్తూ ఓ దృశ్యగీతాన్ని మధుకర్‌ అందించారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌, రాచర్ల గొల్లపల్లి ప్రాంతాల్లోని ప్రకృతి అందాలను పాటలో చిత్రీకరించారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. నా మనసు ఎప్పుడూ నా తెలంగాణ పల్లె చుట్టూనే తిరుగుతుందని చెబుతూ.. మధుకర్‌(మ్యాడీ సీడ్నీ) మన పల్లె కథను అల్లుకున్నానని వివరించారు. ‘సీతక్క బంగుల’ నా తొలి అడుగని, మరిన్ని తెలంగాణ జానపదాలను రూపొందించేందుకు ముందు ముందు కృషి చేస్తానని పేర్కొన్నారు. మధురం డిజిటల్‌ యూ ట్యూబ్‌ చానల్‌ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం ‘సీతక్క బంగుల’ విడుదల అవుతుందని మధుకర్‌ తెలిపారు. తెలంగాణ జానపదాన్ని ప్రపంచానికి అందించేందుకు మధుకర్‌ చేసిన కృషిని అభినందించాల్సిందే.

సిరిసిల్ల చుట్టూ సిడ్నీ యువకుడి షూటింగ్‌

నేడు విడుదలవుతున్న జానపదం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement