శాతవాహన యూజీ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

శాతవాహన యూజీ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

Jul 3 2026 2:04 AM | Updated on Jul 3 2026 2:04 AM

కరీంనగర్‌ సిటీ: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్‌ 2026లో జరిగిన అండర్‌ గ్రాడ్యుయేట్‌ యూజీ ఆరో సెమిస్టర్‌(రెగ్యులర్‌–బ్యాక్‌లాగ్‌), నాలుగో సెమిస్టర్‌(రెగ్యులర్‌–బ్యాక్‌లాగ్‌), రెండో సెమిస్టర్‌(బ్యాక్‌లాగ్‌) పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య పి.సతీశ్‌కుమార్‌, ఓఎస్‌డీ టు ివీసీ డా.హరికాంత్‌, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ డి.సురేశ్‌కుమార్‌, అదనపు పరీక్షల నియంత్రణ అధికారులు డా.శ్రీవాణి, డా.రమాకాంత్‌, డీన్‌, కాలేజ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ డాక్టర్‌ జాఫర్‌ విడుదల చేశారు. ఆరో సెమిస్టర్‌ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ పరీక్షలకు 9,361 మంది హాజరవగా.. 4,721 మంది ఉత్తీర్ణత సాధించారు. బీబీఏ 65 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచింది. నాలుగో సెమిస్టర్‌ పరీక్షలకు 7,902 మంది హాజరవగా.. 3,536 మంది ఉత్తీర్ణత సాధించారు. రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ.. ఫలితాల అనంతరం రీవాల్యుయేషన్‌ లేదా రీకౌంటింగ్‌, జవాబు పత్రాల నకలు(జిరాక్స్‌ కాపీ) పొందాలనుకునే అర్హులైన విద్యార్థులు తమ సంబంధిత కాలేజీల ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో ఈనెల 12 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement