మక్కల లోడుతో వెళ్తున్న లారీబోల్తా | - | Sakshi
Sakshi News home page

మక్కల లోడుతో వెళ్తున్న లారీబోల్తా

Jul 3 2026 2:04 AM | Updated on Jul 3 2026 2:04 AM

గంగాధర: కరీంనగర్‌–జగిత్యాల జాతీయ రహదారి మండలంలోని కురిక్యాల గ్రామ శివారులో గురువారం లారీ బోల్తాపడింది. జగిత్యాల నుంచి కరీంనగర్‌కు మక్కల లోడుతో వెళ్తున్న లారీ కురిక్యాల శివారులోని మూల మలుపు వద్ద అదపుతప్పింది. ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

చెక్‌బౌన్స్‌ కేసులో న్యాయవాదికి ఏడాది జైలు

పెద్దపల్లిరూరల్‌: చెక్‌ బౌన్స్‌ కేసులో పెద్దపల్లి బార్‌ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాది నర్సింగంకి ఏడాది సాధారణ జైలు శిక్ష, రూ.15లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశిస్తూ గురువారం జిల్లా జడ్జి తీర్పునిచ్చారు. ఈ కేసు విషయమై గతంలో సుల్తానాబాద్‌ కోర్టు ఏడాది జైలుతో పాటు ఫిర్యాదుదారునికి రూ.15లక్షలు చెల్లించాలని ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ నర్సింగం జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విని కేసు పూర్వపరాలు పరిశీలించి, గతంలో ఇచ్చిన తీర్పులో చట్టపరమైన లోపం లేదని జిల్లా జడ్జి పేర్కొన్నారు. క్రిమినల్‌ అప్పీల్‌ను కొట్టివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును యధాతథంగా అమలు చేయాలని పేర్కొన్నారు.

చీటింగ్‌ కేసులో నిందితుడి అరెస్టు

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని రాంనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అరుకుటి మల్లేశంను నమ్మించి కేసు పరిష్కారం చేస్తానని రూ.7.5లక్షలు తీసుకొని మోసం చేసిన కేసులో ఇల్లంతకుంట మండలం నర్సక్కపేట గ్రామానికి చెందిన బి.తిరుపతిని అరెస్ట్‌ చేశామని టూ టౌన్‌ పోలీసులు తెలిపారు. మరో నిందితుడు మల్యాల మధును ఇప్పటికే అరెస్టు చేశారు.

విద్యుదాఘాతంతో పశువు మృతి

కథలాపూర్‌: సిరికొండలో గురువారం సాయంత్రం విద్యుదాఘాతంతో ఓ గేదె మృతిచెందినట్లు సర్పంచ్‌ ముదాం రవి తెలిపారు. సిరికొండ గ్రామ శివారులో పచ్చి గడ్డిని గేదెలు మేస్తున్న క్రమంలో సమీపంలో ఉన్న విద్యుత్‌ తీగలను తాకడంతో ఓ గేదె మృతిచెందిందని బాధిత రైతు కొడిపెల్లి లింగారెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. రూ.80వేల విలువైన గేదెను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement