కరీంనగర్‌రూరల్: బాలికపై అత్యాచారం ఘటనలో పోక్సో కేసు నమోదైన నిందితుడిని గురువారం కరీంనగర్‌రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం మానకొండూరు మండలం జగ్గయ్యపల్లెకు చెందిన ఆటోడ్రైవర్ గనుకుండ్ల మురళీకృష్ణ రెండేళ్ల నుంచి ఒక బాలికను కళాశాలకు ఆటోలో తీసుకెళ్తూ ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి స్వగ్రామంలోని ఇంటికి తీసుకెళ్లాడు. మురళీకృష్ణకు వివాహమై కుమార్తె ఉన్నట్లు తెలుసుకున్న బాలిక అతడికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో గత నెల 29న బలవంతంగా ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని పెద్దపల్లి జిల్లా నీరుకుల్ల సమ్మక్క గద్దెల వద్దకు తీసుకెళ్లాడు. చంపుతానని బెదిరించి అత్యాచారం చేశాడు. మరుసటిరోజున బాలిక రూరల్‌పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. గురువారం బొమ్మకల్ శివారులో మురళీకృష్ణ ఉన్నాడనే సమాచారంతో సీఐ నిరంజన్‌రెడ్డి అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేశారు. నిందితుడి వద్ద నుంచి ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. మురళీకృష్ణపై గతంలో వరకట్న వేధింపులు, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు ఉందన్నారు.


