కరీంనగర్‌కల్చరల్/విద్యానగర్/తిమ్మాపూర్: అలుగునూర్ పరిధిలోని కేబుల్ బ్రిడ్జి పక్కనున్న హజరత్ షేర్ అలీ బాబా రహ్మతుల్లా అలైహి 63వ ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నగరంలో షాసాహబ్ మొహళ్ల నుంచి ముస్లింలు, దర్గా వ్యవస్థాపకురాలు దివంగత హజ్రత్ హజీరాబి, కుమారుడు హసన్ వారసుడైన అబ్దుల్ వసీం బారీ, ఫైజ్‌ఖాన్ ఆధ్వర్యంలో ర్యాలీగా సందల్ గ్రంథ లేపనం, ప్రత్యేక చాదర్ హజ్రత్ షేర్ అలిబాబా రహ్మతుల్లా అలైహి సమాధికి సమర్పించారు. సీపీ గౌస్ ఆలం దర్గాను సందర్శించారు. ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు హాఫిజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ యూసుఫ్ తదితరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరీంనగర్, మానకొండూర్, నుస్తులాపూర్, ఎల్‌ఎండీకాలనీ, చింతకుంట ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.


