● లారీలు ఇలా.. వాహనాలకు దారి ఎలా..? | - | Sakshi
Sakshi News home page

● లారీలు ఇలా.. వాహనాలకు దారి ఎలా..?

Jul 3 2026 1:28 AM | Updated on Jul 3 2026 1:28 AM

● లారీలు ఇలా.. వాహనాలకు దారి ఎలా..?

వీణవంక: వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి, కొండపాక, కోర్కల్‌, మల్లారెడ్డిపల్లి గ్రామాల్లో ఇసుక క్వారీలున్నాయి. పోతిరెడ్డిపల్లి నుంచి కొండపాక వరకు రెండు కిలోమీటర్ల మేర ఇసుక లారీలు రోడ్డుకు ఇరువైపుల నిలుపుతున్నారు. ఇసుక లారీలను క్వారీల పరిధిలోనే పార్కింగ్‌ చేసుకోవాలని అప్పటి కలెక్టర్‌తో పాటు సీపీ గౌస్‌ ఆలం క్షేత్రస్థాయిలో పర్యటించి హెచ్చరించినా క్వారీ నిర్వాహకుల తీరు మార డం లేదు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న క్వారీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement