కొత్తపల్లి(కరీంనగర్): ఐఐటీ–జెఈఈ (మెయిన్) బీఆర్క్, బీప్లానింగ్–2026 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని అల్ఫోర్స్ టూనీటాట్స్‌లో బుధవారం ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో విద్యార్థులను సత్కరించారు. బీఆర్క్‌లో ఎస్.శ్రీహిత 174వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలవగా, పటేల్ అక్షయ 189వ ర్యాంకు, డి.తనుశ్రీ 227, వి.రితిక 287, ఎస్.ఆధ్య 319, టి.వెంకట నిహిత్ 903, సి.హెచ్.భీమ 1107, ఆర్.నేహగాయత్రి 1719, పి.శ్రీనిధి 1776, పి.హర్షిణి 2325, ఉమైరా సన్నున్ 2626, పి.అక్షయప్రియ 2786వ ర్యాంకు సాధించిందన్నారు. బీప్లానింగ్‌లో వి.ప్రణతి 858వ ర్యాంకు, పి.క్రిష 1281, ఎమ్.వివేక్ రెడ్డి 1554, ఎమ్.షాలిని 1757, రహీన్ ఉమేద 2448, జి.మహాలక్ష్మి 3053, పి.ఆదిత్యలక్ష్మి 3122వ ర్యాంకు సాధించారన్నారు. రాబోయే ఐఐటీ (అడ్వాన్) పరీక్ష రాసేందుకు ఎంపికై న విద్యార్థులకు అధ్యాపక బృందంతో కోచింగ్ ఇస్తున్నామని తెలిపారు. ఐఐటీ, నీట్, ఈఏపీసెట్ పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులతో ప్రతిష్టాత్మక కళాశాలల్లో అడ్మిషన్లు పొందుతున్నట్లు పేర్కొన్నారు.


