సరిహద్దులు దాటిన సాహితీ పరిమళాలు | - | Sakshi
Sakshi News home page

సరిహద్దులు దాటిన సాహితీ పరిమళాలు

May 7 2026 9:32 AM | Updated on May 7 2026 9:32 AM

హాజరైన కవులు

కవి సమ్మేళనంలో మాట్లాడుతున్న జీవీ శ్యాం ప్రసాద్‌లాల్‌

కరీంనగర్‌ కల్చరల్‌: సాహితీ పరిమళాలు సరిహద్దులు దాటి ఫరిడవిల్లుతోంది. రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి నే పాల్‌లో అరుదైన రీతిలో తెలుగుకవి సమ్మేళనం జరిగింది. ఇండో– నేపాల్‌ కవి సమ్మేళనం పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో 20 మందికి పైగా ప్రఖ్యాత కవులు కవితా గానం చేశారు. వంద మందికి పైగా తెలుగు వారు దీనికి హాజరయ్యారు. ఖాట్మాండులోని క్రిస్టల్‌ పశుపతి హోటల్‌ ఈ సమ్మేళనానికి వేదికై ంది. ఐఏఎస్‌ అధికారి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ మిత్ర బృందం ఆధ్వర్యంలో 135 మంది తెలుగు వారితో చేపట్టిన నేపాల్‌ యాత్రలో భాగంగా ఈ కవి సమ్మేళనం నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్‌ ఎస్‌.రఘు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కవి అన్నవరం దేవేందర్‌ కవి సమ్మేళనాన్ని ప్రారంభించారు. శ్యామ్‌ ప్రసాద్‌ లాల్‌ మాట్లాడుతూ తెలుగు సాహిత్యం విశ్వజనీనమైందన్నారు. సమ్మేళనంలో బూర్ల వెంకటేశ్వర్లు, గాజుల రవీందర్‌, నాంపల్లి సుజాత, మాడిశెట్టి గోపాల్‌, రావికంటి శ్రీనివాస్‌, స్థంభంకాడి గంగాధర్‌, సీవీ శ్రీనివాస్‌, డాక్టర్‌ కూరెళ్ల పద్మాచారి, కృష్ణ గోపాల్‌, ముత్తినేని శ్రీనివాసరావు, డాక్టర్‌ దాసోజు జ్ఞానేశ్వర్‌, సంపత్‌, అశోక్‌, జ్యోతి, గోనె శ్రీనివాస్‌, ప్రేమలత తదితరులు కవితలు వినిపించారు. మల్లికార్జున్‌ దేవ్‌, నల్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఖాట్మాండులో తెలుగు కవి సమ్మేళనం

Advertisement
 
Advertisement
Advertisement