అరుణాచలం, రామేశ్వరం ప్రత్యేక బస్
విద్యానగర్(కరీంనగర్): తీర్థయాత్రల ప్రత్యేక టూర్ ప్యాకేజీలో భాగంగా కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, కంచి, చిదంబర నటరాజ ఆలయం, శ్రీరంగం, మధురై, జంబుకేశ్వర్, రామేశ్వరం, జోగులాంబ దర్శనాలకు కరీంనగర్ 1 డిపో నుంచి రాజధాని ఏసీ బస్సు వెళ్తున్నట్లు డీఎం ఐ.విజయమాధురి తెలిపారు. ఈనెల 14న మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ బస్టాండ్ నుంచి బయలుదేరి 19 తిరిగి చేరుకుంటుందని వివరించారు. పెద్దలకు రూ.8,800, పిల్లలకు రూ.6,600 టికెటు ఉంటుందని తెలిపారు. వివరాలకు 73828 49352, 99592 25920, 80746 90491లలో సంప్రదించాలని కోరారు.
గంజాయి అమ్మితే సమాచారం ఇవ్వండి
వేములవాడ: గంజాయి అమ్మిన వారి సమాచారం ఇవ్వాలని డీఎస్పీ శ్రీనివాసులు కోరారు. పట్టణంలోని పెద్దమ్మగుడి ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో బుధవారం దాడి చేశారు. బైక్‌పై వచ్చిన నాంపల్లికి చెందిన జడల నాగరాజు(50), వడిచర్ల జాన్ ప్రతాప్‌రెడ్డి(60)ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి నుంచి 160 గ్రాముల గంజాయి (రూ.8 వేల విలువ), మొబైల్ ఫోన్, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ పాల్గొన్నారు.


