ఎండాకాలం సెలవులో ఎగిరిన మధురస్మృతులు. వేసవి సెలవులు వచ్చినాయి అంటే అమ్మమ్మ ఊరు పెద్దపహాడ్ వెళ్లడం మేనమామలతో రామాయణం భారతం కథలు చెప్పించుకోవడం ఒక జ్ఞానం. ఇంకా ఆ కాలంలో చుట్టాలు ఇళ్లల్లో తిరగడం కూడా ఒక అలవాటు.మా ఊర్లో ఉన్నప్పుడు ఎండాకాలం సెలవులు లోనే చెరువులలో భావులలో ఈత నేర్చుకునేది. చింత చెట్టు కింద చిర్రగోని ఆట ఆడేది. ఇంటిదగ్గర చింతపండు కొట్టేది . వ్యవసాయ పనులు చేసేది. అట్లాగే రానున్న తరగతి పుస్తకాలను పాత వాటిని సగం ధరకు కొనుక్కునేది. పుట్టలేసుకునేది. రేడియో పాటలు వినడం. ఇంటి బయట వాకిలిలో పడుకొని మా తాత చెప్పే కథలు వినడం అలవాటు. ఇప్పటి యువతరం కూడా ముఖ్యంగా సెల్ ఫోన్లకు టీవీలకు కంప్యూటర్లకు దూరంగా ఉండి శారీరక శ్రమకు సంబంధించిన ఆటలలో పాల్గొనాలి. సాహిత్య కళాత్మక క్రీడా రంగాలలో తర్ఫీదు పొందాల్సిన అవసరం ఉంది. డిజిటల్ మాధ్యమ సాధనాలకు దూరం జరగాల్సిన అవసరం ఉంది.
– అన్నవరం దేవేందర్, కవి, రచయిత, దాశరధి పురస్కార గ్రహీత


