చేనేతను ఆదరించండి
కరీంనగర్‌కల్చరల్: చేనేత వస్త్రాలంటే మక్కువ లేని మగువలు చాలా అరుదు. సంప్రదాయం, అందం, హుందాతనం కలిసిన ఈ హస్తకళను కరీంనగర్ ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో కళాసిల్క్ సంస్థ ముందుకొచ్చింది. కోర్టు చౌరస్తా సమీపంలోని శ్రీ రాజరాజేశ్వర కల్యాణ మండపంలో చేనేత వస్త్రాలు, హస్తకళల ప్రదర్శనతో పాటు అమ్మకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. నేతన్నలకు ఆర్థికంగా చేయూత అందించడమే కాకుండా చేనేత కళను ప్రతి ఇంటికీ చేర్చేందుకు నిర్వాహకులు కృషి చేస్తున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు అద్భుత అల్లికలతో తయారు చేసిన సిల్క్, కాటన్ వస్త్రాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి.
ఎగ్జిబిషన్‌లో పలు రాష్ట్రాల ప్రత్యేకతలు
తెలంగాణలోని గద్వాల్, నారాయణపేట, పోచంపల్లి; ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలంకారి, ఉప్పడ, అస్సాంలోని మూగా, ఎరి సిల్క్, బిహార్‌లోని బాగల్పూర్ సిల్క్, టస్సర్, ఛత్తీస్‌గఢ్‌లోని కోసా సిల్క్, ట్రైబల్ వర్క్స్, గుజరాత్ బంధని, కచ్ ఎంబ్రాయిడరీ, జమ్ము– కశ్మీర్ పాష్మీనా షాల్స్, కర్ణాటక ప్రింటెడ్ శారీస్, మధ్యప్రదేశ్ చందేరి, మహేశ్వరి, రాజస్థాన్ కోటా, బంధని, బ్లాక్ ప్రింట్స్, ఉత్తరప్రదేశ్ బనారస్, లక్నో డ్రెస్ మెటీరియల్స్ వంటి అనేక రాష్ట్రాల ఉత్పత్తులు లభిస్తున్నాయి. అదనంగా హర్యానా బెడ్ కవర్లు, కుషన్ కవర్లు, కుర్తీలు, డోర్ కర్టెన్లు, హ్యాండీక్రాప్ట్స్’ న్యూట్రిషన్ ఫుడ్ ఉత్పత్తులు విక్రయిస్తున్నారు.
రంగురంగుల వస్త్రాలతో సందడి
ప్రత్యేక స్టాళ్లతో ఆకట్టుకుంటున్న ప్రదర్శన
పలు రాష్ట్రాల ఉత్పత్తులు ఒకేచోట
కొనుగోలుదారుల్లో పెరుగుతున్న ఆసక్తి
చేనేత వస్త్రాలు, హస్తకళల ను ప్రోత్సహించండి. కళా కారుల అల్లికలతో రూపొందించిన సిల్క్, కాటన్ వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలు స్తున్నాయి. దేశం నలుమూలల కళాకారుల ఉత్పత్తులను ఒకేచోట అందించేందుకు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని నేతన్నలకు చేయూత అందించాలని కోరుతున్నాం.
– ఎన్.వినోద్, ఎగ్జిబిషన్ మేనేజర్


