చెట్టంత ఆలోచనతో కథ రాశాను | - | Sakshi
Sakshi News home page

చెట్టంత ఆలోచనతో కథ రాశాను

May 6 2026 8:13 AM | Updated on May 6 2026 8:13 AM

చెట్టంత ఆలోచనతో కథ రాశాను చూసినవి, విన్నవే కథలుగా మలిచాం

వేసవి కాలం, ఎండ తీవ్రతకు అంతా ఇబ్బంది పడుతున్న విషయంపై నేను రాసిన కథ అందరికి నచ్చింది. తోవ వెంబడి ఒక్క చెట్టు లేదు అని వృద్దుడు చెప్పిన విషయంతో చెట్లు నాటితే అవి మనుషులకు ఎంత సేవ చేస్తాయే రాశాను. స్వచ్ఛమైన గాలిని ఇవ్వడమే కాదు.. నీడనిచ్చి పండ్లను ఇచ్చే చెట్టుకు ఉన్న ప్రాధాన్యతను కథలో వివరించాను. అందరు చెట్లు నాటి వాటిని సంరక్షించాలని కథలో చెప్పాను. మేము కూడా కథలు రాయగలమని మా టీచర్లు ప్రోత్సహించారు.

– చిగురు ప్రణయ్‌, 8వ తరగతి

కథలు, కవితలు రాయాలంటే పెద్ద చదువులు చదివి ఉండాలని అనుకునేదాన్ని. మా స్కూల్‌లో పెద్ద సారు, తెలుగు టీచర్‌ మాతో కథలు రాయించారు. మనం చూసినవి, విన్నవి, మన చుట్టూ జరిగే సంఘటనలతో కథలు రాయవచ్చని చెప్పారు. పెద్ద పెద్ద పదాలు అవసరం లేదన్నారు. అలా నేను కూడా మామిడిపండ్ల గంప పేరుతో కథ రాశాను. అది అందరికీ నచ్చింది. ఆటపాటలతోపాటు చదువు ఉండాలని, అల్లరి ఒక స్థాయి వరకే అని చెప్పే కథ ఇది.

– కీర్తన, పదో తరగతి

Advertisement
 
Advertisement
Advertisement