కరీంనగర్ కార్పొరేషన్: జువెల్లరీ దొంగలను పట్టుకొని, ఆభరణాలను రికవరీ చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. దొంగతనం జరిగిన పీఎంఏ జువెల్లరీని సోమవారం సందర్శించారు. దొంగల దాడిలో గాయపడ్డ సిబ్బందిని హాస్పిటల్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాయపడ్డ వారిని మెరుగైన చికిత్సకోసం అవసరమైతే హైదరాబాద్ తరలిస్తామన్నా రు. దొంగతనంపై గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి పోలీస్ శాఖ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ కల్చర్, పబ్‌కల్చర్, గంజాయిలపై ఈగల్‌ను తీసుకువచ్చి ఉక్కుపాదం మోపారన్నా రు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వామన్‌రావు దంపతులను నడిరోడ్డుపై చంపిన దిక్కులేదని, దిశలాంటి ఎన్నో కేసులు జరిగాయని గుర్తు చేశారు. ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం మూడు రోజుల్లో విరమింప చేస్తే బీఆర్‌ఎస్ తట్టుకోలేకపోతుందన్నారు. పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్ పాల్గొన్నారు.


