సాక్షితోనే ఉత్తమ ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

సాక్షితోనే ఉత్తమ ఫలితాలు

May 5 2026 7:20 AM | Updated on May 5 2026 7:20 AM

588 మార్కులు వచ్చాయి సులభతరంగా ఉంది అత్యధిక మార్కులు సాధించాను

ఇల్లంతకుంట(మానకొండూర్‌): పదోతరగతి విద్యార్థులకు ‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ ఉపయోగపడిందని పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలిపారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో చాలామంది విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. ‘సాక్షి’ యాజమాన్యం 10వ తరగతి పరీక్షలకు రెండు నెలల ముందు నిష్ణాతులైన అధ్యాపక బృందం ఆధ్వర్యంలో ఫిజికల్‌ సైన్స్‌, మ్యాథమెటిక్స్‌ స్టడీ మెటీరియల్‌ను రూపొందించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందజేసింది. ఈక్రమంలోనే మండలంలోని రహీంఖాన్‌పేట మోడల్‌స్కూల్‌కు 10 సాక్షి దినపత్రికలను కూడా అందించారు. విద్యార్థులకు అందజేసిన స్టడీ మెటీరియల్‌తో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులు సులభతరమయ్యాయని విద్యార్థులు పేర్కొన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించడంతోపాటు ఉత్తీర్ణత శాతం పెరిగిందని ఉపాధ్యాయులు తెలిపారు.

స్టడీ మెటీరియల్‌ ఉపయోగపడిందన్న విద్యార్థులు ఉత్తమ మార్కులతో విద్యార్థుల ఉత్తీర్ణత

ఉపాధ్యాయులు సిలబస్‌ను డిసెంబర్‌ వరకే పూర్తి చేశారు. సెప్టెంబర్‌ నుంచి అదనపు త రగతులు నిర్వహించారు. పరీ క్షలకు రెండు నెలల ముందు ‘సాక్షి’ స్టడీమెటీరియల్‌ ఫిజి క్స్‌, మ్యాథమెటిక్స్‌ ఉచితంగా అందించారు. ఉపాధ్యాయులందించిన నోట్స్‌తోపాటు సాక్షి స్టడీ మెటీరియల్‌ చదువుకోవడం జరిగింది. సులభతరంగా ఉంది. 588 మార్కులు సాధించడంలో దోహదపడింది. సాక్షి యాజమాన్యానికి కృతజ్ఞతలు.

– ఎం.హర్షిత, రహీంఖాన్‌పేట మోడల్‌స్కూల్‌

‘సాక్షి’ యాజమాన్యం అందించిన స్టడీ మెటీరియల్‌ సులభతరంగా ఉంది. నోట్స్‌తోపాటు స్టడీమెటీరియల్‌ చదవడంతో కఠినంశాలు సులభంగా అర్థమయ్యాయి. సాక్షి స్టడీ మెటీరియల్‌తోపాటు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో 582 మార్కులు సాధించాను.

– నారెడ్డి మహిత,

రహీంఖాన్‌పేట మోడల్‌ స్కూల్‌

పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న సమయంలో ‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ ఉచితంగా అందించారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహానికి స్టడీ మెటీరియల్‌ తోడు కావడంతో 572 మార్కులు సాధించాను. ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌లో మార్కులు స్కోరు కావడానికి స్టడీ మెటీరియల్‌ దోహదపడింది.

– అప్సా తహమీనా,

రహీంఖాన్‌పేట మోడల్‌స్కూల్‌

Advertisement
 
Advertisement
Advertisement