రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ధర్మపురి: శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తూ ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ వ్యకిత మృతి చెందాడు. ఎస్సై మహేశ్ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండం దమ్మన్నపేటకు చెందిన మైదం రాజన్న (65) శుభకార్యానికి హాజరయ్యేందుకు ఆదివారం ద్విచక్ర వాహనంపై ఓ గ్రామానికి వెళ్లాడు. రాత్రివేళ ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో ధర్మపురిలోని తమ్మల్లకుంట వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని వెంటనే 108 అంబులెన్సులో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
హుజూరాబాద్‌రూరల్: వరంగల్ – కరీంనగర్ ప్రధాన రోడ్డు మందాడిపల్లి గ్రామ సమీపంలో కంటైనర్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బిహార్‌కు చెందిన హమాలీ రాజు మంజిత్ (18) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. సిరిసిల్లలో హమాలీ పని చేసుకునే కూలీలు స్వగ్రామానికి వెళ్లేందుకు కరీంనగర్ వరకు బస్సులో వచ్చారు. అక్కడి నుంచి వరంగల్‌కు ఆటో మాట్లాడుకున్నారు. ఆటో మందాడిపల్లి వద్దకు చేరుకోగానే వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా ధ్వంసమైంది. కంటైనర్ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రైలు నుంచి పడి యువకుడు..
జమ్మికుంట: మండలంలోని బిజిగిరిషరీప్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. రామగుండం రైల్వే హెడ్‌కానిస్టేబుల్ గంగారపు తిరుపతి తెలిపిన వివరాలు.. ఖమ్మం జిల్లా చింతకాని గ్రామానికి చెందిన దేవళ్ల రాజేశ్(33) రెండేళ్లుగా వరంగల్ పట్టణంలో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. రాజేశ్ సెల్‌ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని మృతుడి అన్న సతీశ్ ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేశా తిరుపతి వివరించారు.


