మండుతున్న ఎండ.. నిప్పులు కురిపిస్తున్న భానుడు.. నిర్మానుష్యంగా రహదారులు.. ప్రధాన రహదారుల్లో నిలువ నీడలేక ప్రజలు అల్లాడిపోతుండగా.. నగరంలోని అంబేడ్కర్ స్టేడియం దారిలో ఇరువైపుల ఏపుగా పెరిగిన చెట్లు పచ్చని పందిరిని తలపిస్తున్నాయి. భగత్‌సింగ్ విగ్రహం నుంచి అంబేడ్కర్ స్టేడియం మీదుగా ఎల్‌ఐసీ చౌరస్తా వరకు వాహనదారులు, ప్రయాణికులు, వాకర్లు, చిరువ్యాపారులకు చల్లని నీడనిస్తున్నా యి. ఈ రహదారి గుండా వెళ్లే వాహనదారులు కాసేపు ఆగి స్వచ్ఛమైన గాలిని పీల్చుతూ సేదతీరుతున్నారు. 50 మందికి పైగా చిరువ్యాపారులు ఈ చెట్లనీడన ఉపాధి పొందుతున్నారు. పచ్చని తోరణంలాంటి ఈ వాతావరణం కాంక్రీట్ అడవిలో ప్రకృతి ఇచ్చిన గొప్ప బహుమతిగా కనిపిస్తోంది. పర్యావరణాన్ని కాపాడుకుంటే అది మనల్ని ఎలా కాపాడుతుందో చెప్పడానికి ఈ మార్గం చక్కని ఉదాహరణ. – కరీంనగర్‌స్పోర్ట్స్
భగత్‌సింగ్ విగ్రహం నుంచి ఇండోర్ స్టేడియం గేట్ రహదారిలో
ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లే రహదారిలో పచ్చని చెట్లు


