గన్నేరువరం/చిగురుమామిడి: జిల్లాలోని పలు ఆలయాల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ దంపతులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గన్నేరువరం మండలం ఖాసీంపేట శ్రీ మానసాదేవిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. పారువెల్ల శ్రీ లక్ష్మీగణపతి, మైలారంలోని స్వయం భూ శ్రీ మల్లికార్జునస్వామి వారి ని దర్శించుకున్నారు. చిగురుమామిడి మండలం ఇందుర్తి రేణుక ఎల్లమ్మతల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆయా ఆలయ కమిటీల చైర్మన్లు ఏలేటి చంద్రారెడ్డి, వరాల పర్శరాములు, బద్దం తిరుపతిరెడ్డి న్యాయమూర్తికి తీర్థప్రసాదాలు అందజేసి, శాలువాలతో సన్మానించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పెండ్యాల ఆమర్నాథ్ శర్మ, మామి డాల నాగసాయిశర్మ, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్యాల ప్రతాప్, తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంపల్లి నాగరాజు, సర్పంచ్‌లు కర్నె చంద్రయ్య, చింతపూల నరేందర్ పాల్గొన్నారు.
5న మెగా జాబ్ మేళా
కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు మే 5న మెగాజాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఆదివారం జాబ్‌మేళా వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. డీఈఈట్, టాస్క్, ఉపాధి కల్పన కార్యాలయ సమన్వయంతో సుమారు 100 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు విద్యా సంస్థలతో సమన్వయం చేసుకుని డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాలల పూర్వ విద్యార్థుల వివరాలను సేకరించి, నిరుద్యోగులుగా ఉన్నవారికి సమాచారం చేరేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధశాఖల అధికారులు శ్రీనివాస్‌గౌడ్, తిరుపతిరావు పాల్గొన్నారు.
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: 33/11 కె.వీ. శాతవాహన విశ్వవిద్యాలయ సబ్‌స్టేషన్‌లో నూతన 8.0 ఎంవిఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా సోమవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చింతకుంట, కమాన్‌పూర్, మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో విద్యుత్ సరఫరా కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల పనులు చేపడుతున్నందున ఉదయం 9.30 నుంచి 9.30 గంటల వరకు 11 కె.వీ.అల్కాపూరి పీడర్ పరిధిలోని అల్కాపురి, నాగుల ఎల్లమ్మ ఆలయం, సవరన్ స్కూల్ వీధి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.


