ధరలను తగ్గించాల్సిందిపోయి ఏటికేడు ధరలను పెంచుతున్నారు. కమర్షియల్ గ్యాస్ ధర ఒకప్పుడు రూ.2వేలు ఉండేది. మూడున్నరేళ్లలో రూ.3వేలకు పైగా చేరింది. ఈ ధరను సాకుగా చూపి వినియోగదారులపై భారం వేస్తున్నారు. – శిరీష, కట్టరాంపూర్
టిఫిన్ సెంటర్‌తో ఉపాధి పొందుతున్న. ఇప్పటికే మా రంగంలో పోటీ ఎక్కువ. ఇపుడేమో గ్యాస్ ధరను ఏకంగా రూ.993 పెంచారు. ఆ ధరతో టిఫిన్లు చేయడం.. ఇపుడున్న ధరతోనే కస్టమర్‌కు టిఫిన్ సరఫరా చేయాలంటే మాకు గిట్టుబాటు కాదు. టిఫిన్ ధర పెంచితే కస్టమర్లు వస్తారో.. రారో..?
– అనిల్, వ్యాపారి


