కరీంనగర్ సిటీ: కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి రెండు నూతన అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాం(ఏఈడీపీ) కోర్సులు మంజూరు చేశారని ప్రిన్సిపాల్ కె.రామకృష్ణ శనివారం తెలి పారు. కొత్తగా మంజూరు చేసిన బీకాం బీఎఫ్ ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్), బీఎస్సీ హెల్త్ కేర్ ఏఈడీపీ కోర్సులు ఈ ఏడాది నుంచి ప్రారంభం కానున్నాయని తెలిపారు. వీటితో పాటు బీఎస్సీ లైఫ్ సైన్స్‌లో ‘మెడికల్ ఫిజియాలజీ’ అనే కొత్త సబ్జెక్టు కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పలు కోర్సుల్లో సీట్ల పెంపు చేపట్టినట్లు తెలిపారు. బీఎస్సీ లైఫ్‌సైన్స్‌లో 300 సీట్లకు అదనంగా 60, బీఎస్సీ ఫిజికల్ సైన్స్‌లో 60 , బీఏ (సీబీసీఎస్) ఇంగ్లిష్ మీడియంలో 60, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్‌లో 60 సీట్లు పెంచినట్లు పేర్కొన్నారు. దీంతో కళాశాలలో మొత్తం సీట్లు 1,980కు పెరిగినట్లు తెలిపారు. నూతన కోర్సులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకి ష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఎ. శ్రీదేవసేన, కళాశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్లు ప్రొఫెసర్ రాజేందర్ సింగ్, ప్రొఫెసర్ పి.బాల భాస్కర్, కళాశాల విద్య జేఏసీ చైర్మన్ డాక్టర్ కె. సురేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
కొత్తపల్లి(కరీంనగర్): అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విద్యుత్ భద్రతపై రైతులు, వినియోగదారులకు అవగాహన కల్పించాలని టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ రాపెల్లి రవీందర్ సూచించారు. శనివారం సర్కిల్ ఆఫీస్‌లో విద్యుత్ భద్రత వారోత్సవాల ఆవశ్యకతను వివరించి ప్రమాణం చేయించా రు. విద్యుత్ ప్రమాదాలను జీరోస్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశింంచారు. స్తంభంపై సిబ్బంది పనిచేసేటప్పుడు విధిగా సేఫ్టీ బెల్ట్, ఎర్త్ రాడ్, హెల్మెట్, ఓల్టేజ్ డిటెక్టర్, ఇతర పరికరాలు ధరించాలని సూచించారు. ప్రమాద సూచనలు కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలని లేదా 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. డీఈలు ఉపేందర్, రాజం, ఏడీఈలు పి.శ్రీనివాస్, ఎం.లావణ్య పాల్గొన్నారు.
విద్యానగర్(కరీంనగర్): మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ శక్తి పథకం ద్వారా కరీంనగర్ అశోక్‌నగరలో ప్రకృతి పర్యావరణ సంస్థ నిర్వహిస్తున్న శక్తి సదన్ కేంద్రాన్ని శనివారం జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి డి.వెంకటేశ్ సందర్శించారు. శక్తి సదన్ నిర్వహణ, బాధితులకు అందిస్తున్న సేవలు, కల్పిస్తు న్న సౌకర్యాలను పరిశీలించారు. శక్తి సదన్ సూపరింటెండెంట్ ఎ.రమాదేవి, సిబ్బంది వసంత, రజిత, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
కరీంనగర్‌టౌన్: నేడు జరిగే నీట్ ప్రవేశ పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కరీంనగర్‌లోని ఎస్సారార్ డిగ్రీ కాలేజీ, మహిళా ఉమెన్స్ డిగ్రీ కాలేజీ, అలుగునూరులోని కేంద్రీయ విద్యాలయం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్, ఉజ్వల పార్కు సమీపంలోని బాలికల పాలిటెక్నిక్ కళాశాల, చింతకుంట ఎస్సీ రెసిడెన్షియల్ స్కూలు, కేబుల్ బ్రిడ్జి సమీపంలోని మైనార్టీ స్కూల్‌లో పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి.
పటిష్ట భద్రత
కరీంనగర్‌క్రైం: నీట్ పరీక్షకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేలా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలి పారు. పరీక్షా సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు , ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయించాలని ఆదేశించారు.


