టెండర్ల మతలబేమిటి? | - | Sakshi
Sakshi News home page

టెండర్ల మతలబేమిటి?

May 3 2026 7:47 AM | Updated on May 3 2026 7:47 AM

● ప్రశ్నిస్తే కార్పొరేటర్లపై కేసులు, అరెస్టులా? ● కార్పొరేటర్‌ రవీందర్‌ సింగ్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: డంప్‌యార్డ్‌లో చెత్తను బయోమైనింగ్‌ చేసేందుకు పిలిచిన టెండర్లను ఎందుకు ఓపెన్‌చేయడం లేదని మాజీ మేయర్‌, 58వ డివిజన్‌ కార్పొరేటర్‌ సర్ధార్‌ రవీందర్‌ సింగ్‌ ప్రశ్నించారు. శనివారం నగరంలో మాట్లాడుతూ డంప్‌యార్డ్‌లో చెత్తను తగ్గించేందుకు ఇటీవల రూ.2 కోట్లతో బయోమైనింగ్‌ కోసం టెండర్‌ పిలిచారన్నారు. టెండర్‌లో ఐదుగురు పాల్గొన్నారని, టెండర్‌ ఓపెన్‌చేయడం లేదన్నారు. తమకు నచ్చిన వారికి రాదనే భయంతోనే టెండర్‌ ఓపెన్‌కు అధికారులు వెనుకాడుతున్నట్లున్నారని విమర్శించారు. ఓ వైపు డ ంప్‌యార్డ్‌తో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటే, టెండర్‌లో జాప్యం ఎందుకున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కార్పొరేటర్లు, వారి భర్తలపై కేసులు పెడుతున్నారన్నారు. అదే కాంట్రాక్టర్లు తిట్టినా అధికారులు కిమ్మనడం లేదని మండిపడ్డారు. కార్పొరేటర్లపై కేసులు పెట్టడంలో ఉన్న ఉత్సాహం అవినీతి అధికారులపై కేసులకు ఉండడం లేదన్నారు. కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నగర ప్రజల కష్టాలను గాలికి వదిలేశారని విమర్శించారు. నగరపాలకసంస్థ కమిషనర్‌, ఎస్‌ఈ అవినీతిపై తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ చేసి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవన్నారు.ఉద్యమం ఏదైనా కరీంనగర్‌ నుంచే మొదలవుతుందని, కార్పొరేటర్లంతా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు తుల భాస్కర్‌రావు, దండబోయిన రాము, మల్లేశం, మైకెల్‌ శ్రీనివాస్‌, కెమసారం తిరుపతి, రంగు శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement