కరీంనగర్: పిల్లల ఆరోగ్యం, భద్రత, సమగ్ర అభి వృద్ధికి సమాజం కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ సూచించారు. ప్రజాపాలనా ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ జనరల్ ఆ స్పత్రిలో నిర్వహించిన బాలల భద్రత, రక్షణ, సంక్షేమ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అ మలు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీసర్ రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో వెంకటరమణ


