శివారు కాలనీలకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

శివారు కాలనీలకు ప్రాధాన్యం

May 2 2026 8:14 AM | Updated on May 2 2026 8:14 AM

‘ఇందిరమ్మ’ స్పీడ్‌ పెంచాలి నాణ్యమైన విత్తనాలు కొనాలి డీఐఈవో బాధ్యతలు స్వీకరణ శ్రీనివాస్‌కు ‘శ్రమశక్తి’ అవార్డు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలోని శివారు కాలనీలు, విలీన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ తెలిపారు. నగరపాలకసంస్థ 21వ డివిజన్‌ విద్యానగర్‌లో రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, తాగునీటి పైప్‌లైన్‌ పనులకు కార్పొరేటర్‌ వరాల నర్సింగంతో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే తమ పాలకవర్గం లక్ష్యం అన్నా రు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ ఆదేశించారు. శుక్రవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో హౌసింగ్‌, మున్సిపల్‌శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇండ్లు త్వరగా పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. మొదటి విడతలో ఇండ్లు మంజూరై నిర్మాణాలు చేపట్టలేమని నగరపాలకసంస్థకు రాసిచ్చిన వారిస్థానంలో కొత్తగా అర్హులైనవారిని ఎంపిక చేయాలని సూ చించారు. డివిజన్లవారీగా ఎల్‌–1లో ఉన్న లబ్ధి దారులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి నిజమైన అర్హులను ఎంపిక చేయాలన్నారు. డిప్యూటీ కమిషనర్‌ ఖాదర్‌ మొహియొద్దీన్‌ పాల్గొన్నారు.

కొత్తపల్లి(కరీంనగర్‌): వానాకాలంలో రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి జె.భాగ్యలక్ష్మి సూ చించారు. లైసెన్స్‌ కలిగిన విక్రయ కేంద్రాల్లో విత్తనాలు కొనుగోలు చేసి, బిల్‌ తీసుకోవా లన్నారు. కొత్తపల్లి రైతు వేదికలో శుక్రవారం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో పలు సూచనలు చేశారు. తక్కువ యూరియా వాడాలని, సాగు ఖర్చును తగ్గించాలని, నేల ఆరోగ్యాన్ని కాపాడాలని, సుస్థిర ఆదాయాన్ని పొందాలన్నారు. మార్కెట్‌లో గిరాకీ ఉన్న పంటలను ఎంపిక చేసుకోవాలన్నారు. వరిలో సాగుచేసే రకాల గురించి ఆర్‌ఏఆర్‌ఎస్‌ పొలా స శాస్త్రవేత్త డా.మధుకర్‌; కోతుల బెడదలేని ఆయిల్‌ పామ్‌ పంట సాగు గురించి సహాయ వ్యవసాయ సంచాలకుడు కె రణధీర్‌రెడ్డి వివరించారు. సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.చత్రు నాయక్‌ పేర్కొన్నారు. ఏవో కె.సంతోష్‌కుమార్‌, ఏఈవో రాము పాల్గొన్నారు.

కరీంనగర్‌ టౌన్‌: జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారిగా వి.ఆంజనేయరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. పెద్దపల్లి ఇంటర్‌ విద్యాధికారి డి.కల్పన, ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు వి.సత్యవర్ధన్‌రావు, ఏ.సత్యనారా యణ, సీహెచ్‌.శశిధర్‌శర్మ, కె.రాజేశ్వర్‌రావు, రాష్ట్ర ప్రిన్సిపా ల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, జిల్లా జూనియర్‌ కళాశాలల లెక్చరర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, లైబరీయన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రామ్మోహన్‌, ఇంటర్‌ విద్యా బాధ్యులు కిరణ్‌, బల్బీర్‌సింగ్‌ అభినందించారు.

కొత్తపల్లి(కరీంనగర్‌): మేడేకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ‘శ్రమశక్తి’ అవార్డుకు టీజీ ఎన్‌పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ పరిధిలోని అలుగునూరు సెక్షన్‌ ఏఏవో కొండూరు శ్రీనివాస్‌ ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement