● రద్దీ రూట్లలోనూ సులభంగా రైలు టికెట్లు
● పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల సందర్శనకు అవకాశం
రామగుండం: ప్రస్తుత వేసవిలో పర్యాటక, పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయి తే, తక్కువ వ్యయంతో సుఖంగా, ప్రశాంతంగా ప ర్యటన సాగేందుకు రైలు ప్రయాణానికే మొగ్గుచూపుతున్నారు. సుదూర ప్రాంతాలను సందర్శించాలనుకునే వారికి.. ముఖ్యంగా సందర్శన స్థలాలకు రైల్వే కనెక్టివిటీ, రైళ్ల వివరాలు తదితర అంశాలపై కొంత అవగాహన ఉండాలని అధికారులు సూచిస్తు న్నారు. వారణాసి, న్యూఢిల్లీ, బెంగళూరు, చైన్నె త దితర ప్రాంతాలకు నడిచే డైరెక్ట్ రైళ్లు రెండు నెలల ముందే రిజర్వేషన్లు పూర్తవుతాయి. సాధారణ బో గీల్లో కనీసం అడుగు పెట్టలేని పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అప్పటికప్పుడు టూర్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నా ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయించాల్సిందే. తద్వారా ఖర్చుభారం పెరుగుతుంది. ఇందుకు ప్ర త్యామ్నాయంగా సమీప ప్రాంతాలకు వెళ్లే రైళ్లపై ప్ర త్యేక దృష్టి సారిస్తే.. టికెట్లు సులభంగా లభ్యమ య్యే అవకాశం ఉంది. న్యూఢిల్లీ వైపు వెళ్లాలంటే హ జ్రత్ నిజాముద్దీన్, డెహ్రాడూన్, చైన్నె వైపు వెళ్లేవా రు ఎగ్మోర్, తాంబరం, పెరంబూర్, చెంగల్పట్టు, అ రక్కోణం, గూడూర్, రేణిగుంట, బెంగళూరు వైపు వెళ్తే యశ్వంతపూర్ తదితర రైళ్ల ద్వారా ప్రధా న కేంద్రాలకు సులభంగా చేరుకోవచ్చు. వీటిపై అవగాహన ఉంటే ప్రయాణం సుఖమయమవుతుంది.
వారణాసి వైపు వెళ్లేందుకు..
ప్రయాగ్‌రాజ్, వారణాసి, అయోధ్య సందర్శించాలనుకునే వారికి రైలు సౌకర్యం బాగానే ఉంది. ప్రధానంగా సికింద్రాబాద్ నుంచి వారణాసికి నేరుగా రెండు రైళ్లు నడుస్తున్నాయి. వీటికి రెండునెలల ముందే బుకింగ్ పూర్తయ్యింది. అయితే, ప్రత్యామ్నాయంగా వారణాసికి 16 కిలోమీటర్ల దూరంలో పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ(డీడీయూ) రైల్వేస్టేషన్ మీదుగా అనేక రైళ్లు నడుస్తుంటాయి. ఈ రైళ్లను ఆశ్రయిస్తే డీడీయూ రైల్వేస్టేషన్‌లో దిగి రోడ్డు మార్గం ద్వారా వారణాసి, అయోధ్య వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.


