ఒకేరోజు 11 అగ్ని ప్రమాదాలు | - | Sakshi
Sakshi News home page

ఒకేరోజు 11 అగ్ని ప్రమాదాలు

May 2 2026 8:14 AM | Updated on May 2 2026 8:14 AM

కరీంనగర్‌క్రైం: జిల్లావ్యాప్తంగా శుక్రవారం 11 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఆయా ప్రాంతాలకు సమయానికి చేరకున్న ఫైర్‌ సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ఫైర్‌ అధికారుల వివరాల ప్రకారం కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో కేబుళ్లు, గంగాధర మండలం కురిక్యాల, కొత్తపల్లి మండలం మల్కాపూర్‌లో పంటచేలు, కరీంనగర్‌ రూరల్‌ మండలం ఎలబోతారంలో శక్తి కాటన్‌ ఇండస్ట్రీస్‌లో మంటలు చెలరేగాయి. చొప్పదండి మండలం మల్లన్నపల్లిలో, గుమ్లాపూర్‌లో పంటచేలు దగ్ధమయ్యాయి. శాతవాహన యూనివర్సిటీ సమీపంలో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. అల్గునూర్‌లో గడ్డివాము దగ్ధమైంది. హుజూరాబాద్‌ కోతుల నడుమలో గడ్డివాము, జయశంకర్‌ భూపాలపల్లి మండలం మొగుళ్లపల్లి మండలం ఎల్లారెడ్డిపేటలో మొక్కజొన్న చేనులో మంటలు తలెత్తడంతో జమ్మికుంట ఫైర్‌ సిబ్బంది వెళ్లి మంటలు ఆర్పారు. తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీలో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించారు. ఆయా ఘటనల్లో కరీంనగర్‌, మానకొండూర్‌, చొప్పదండి, జమ్మికుంట ఫైర్‌ సిబ్బంది పాల్గొన్నట్లు డివిజన్‌ ఫైర్‌ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లావ్యాప్తంగా పలు రైస్‌మిల్లుల్లో అగ్నిప్రమాదాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement