తిమ్మాపూర్: మండలకేంద్రంలో రాజీవ్‌రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం భాషాగూడకు చెందిన బడావత్ ప్రదీప్ నాయక్ (24) మృతిచెందాడు. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న మరో ఇద్దరు గాయపడ్డారు. ఏప్రిల్ 30న మధ్యాహ్నం ప్రదీప్ తన స్నేహితుడి మహీంద్రా థార్‌ను తీసుకొని సోదరి నందిని, ఆమె స్నేహితురాలు, స్నేహితుడు పవన్, మంచిర్యాలకు బయల్దేరారు. నందిని స్నేహితురాలిది మంచిర్యాల కావడంతో ఆమెను దించి రాత్రి అక్కడే ఉన్నారు. తిరిగి శుక్రవారం ఉదయం మహేశ్వరం బయల్దేరారు. మండలంలోని మహాత్మానగర్ వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రదీప్‌నాయక్ అక్కడికక్కడే మృతిచెందాడు. వాహనంలో ఉన్న నందిని, పవన్‌కున గాయాలయ్యాయి. వీరిని 108లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. ప్రదీప్ తండ్రి బదావత్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్‌ఎండీ పోలీసులు తెలిపారు.
మరో ఇద్దరికి గాయాలు
తిమ్మాపూర్ మండలకేంద్రంలో ఘటన


