విద్యుదాఘాతంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంలో వ్యక్తి మృతి

May 2 2026 8:14 AM | Updated on May 2 2026 8:14 AM

కోరుట్ల రూరల్‌: పట్టణంలోని హాజిపురాకు చెందిన వావిలాల నవీన్‌ (28) అనే వ్యక్తి శుక్రవారం విద్యుదాఘాతంలో మృతి చెందినట్టు ఎస్సై చిరంజీవి తెలిపారు. పట్టణ శివరులోని ఎల్లమ్మ గుడి వద్ద గల వాగులో చేపలు పట్టేందుకు కరెంటు వైర్‌ ఉపయోగించగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ తగిలి మృతి చెందాడని అన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో హోటల్‌ దగ్ధం

వీర్నపల్లి: మండలంలోని కంచర్లలో షార్ట్‌ సర్క్యూట్‌తో బస్టాండ్‌ వద్ద ఓ గుడిసెతో పాటు చాట్ల శంకర్‌ అనే వ్యక్తికి చెందిన హోటల్‌ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.20 వేలవరకు నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. జీపీకి సంబంధించిన బోరుమోటార్‌ వైర్లు కూడా కాలిపోవడంతో, సుమా రు రూ.10 వేల వరకు నష్టం జరిగింది. సర్పంచ్‌ సామల్ల దేవరాజ్‌, జీపీ సిబ్బంది రైతులు మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement