మల్లాపూర్: మల్లాపూర్ మండలంలోని రేగుంట శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లికి చెందిన వాసం మురళి గూడ్స్ ఆటోలో గొర్రెపల్లి నుంచి రేగుంట వైపు వస్తుండగా, అతివేగంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. స్థానికులు అందించిన సమాచారంతో కుటుంబసభ్యులు ఘటనస్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ మురళిని అంబులెన్స్‌లో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మల్లాపూర్ ఎస్సై అనిల్, పోలీసు సిబ్బందితో ఘటనస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.


