పాత పద్ధతిలోనే
ధాన్యం కొనుగోళ్లు
కరీంనగర్‌రూరల్: ధాన్యం కొనుగోళ్లకు ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ విధానాన్ని జిల్లా యంత్రాంగం నిలిపివేసింది. పాత పద్ధతిలోనే కొనుగోళ్లు పూర్తి చేయాలని సివిల్‌సప్లైశాఖ కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది. ఆన్‌లైన్ ట్రక్‌షీట్ విధానంతో రైతులు ఎదుర్కొంటున్న ఇ బ్బందులపై ‘సాక్షి’లో ఇటీవల కథనాలు ప్రచురించగా, స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ చిత్రమిశ్రాకు సూచించారు. మూడురో జులుగా సాంకేతిక సమస్యలతో కొనుగోళ్లను నిలిపివేసిన నిర్వాహకులు, గురువారం ధాన్యం కాంటా పెట్టి రైతులకు ట్రక్‌షీట్ జారీ చేసి, మిల్లులకు ధాన్యం పంపించారు.
ఆన్‌లైన్ ట్రక్ షీట్‌తో ఇబ్బందులు
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం ఆన్‌లైన్ ట్రక్‌షీట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కేంద్రాల్లో ధాన్యం కాంటా పెట్టి ట్యాబ్‌లో రైతుపేరు, సెల్ నంబరు, ఆధార్ నంబరు, బ్యాంకుఅకౌంట్ నంబరు ఆన్‌లైన్‌లో నమోదు చేయగానే రైస్‌మిల్లు అలాట్‌మెంట్ వస్తుంది. ధాన్యం లోడింగ్ వెంటనే ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేసేందుకు సివిల్‌సప్లై యాప్‌లో సాంకేతిక సమస్యలు నెలకొనడం, ఇంటర్నెట్ సిగ్నల్ లేకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ట్రాక్టర్లకు జీపీఎస్ ట్రాకర్ ఉండాలనే నిబంధనతో యజమానులు ట్రాక్టర్లను పెట్టేందుకు ముందుకు రాలేదు. రైతుల ఇబ్బందులపై స్పందించిన మంత్రి పొన్నం వెంటనే పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోళ్లను చేపట్టాలని కలెక్టర్ చిత్రామిశ్రాకు సూచించారు. కలెక్టర్ సివిల్‌సప్లై అధికారులతో మాట్లాడి ఇక నుంచి గతంలో ధాన్యం కొనుగోలు చేసినట్లుగానే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
చెర్లభూత్కూర్‌లో ధాన్యం కాంటా


