జిల్లా జైలు సందర్శన | - | Sakshi
Sakshi News home page

జిల్లా జైలు సందర్శన

May 1 2026 6:03 AM | Updated on May 1 2026 6:03 AM

కరీంనగర్‌క్రైం: జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి టి.రాణి గురువారం జిల్లా జైలును సందర్శించారు. ఖైదీల న్యాయసేవ, ఆరోగ్య సమస్యలపై ఆరా తీశారు. జైలులో క్యాంటీన్‌, ఆస్పత్రి ములాఖత్‌, టెలిఫోన్‌ సౌకర్యం, లైబ్రరీ, వంటశాల, జైలు ఇండస్ట్రీలో పని తీరును పరిశీలించారు. కొత్త చట్టాలపై ఖైదీల ను అవగాహన కల్పించారు. మహిళా ఖైదీల బాగోగులు, జైలులో కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. లాయర్‌ను పెట్టుకునే స్థోమత లేనివారికి ప్రభుత్వ లాయర్‌ను నియమిస్తామన్నారు. జైలు సూపరింటెండెంట్‌ విజ యదేని, జైలర్లు పి.శ్రీనివాస్‌, రమేశ్‌, డిప్యూటీ జైలర్లు ఎస్‌.సుధాకర్‌రెడ్డి, ఎల్‌.రమేశ్‌, లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ తణుకు మహేశ్‌ పాల్గొన్నారు.

సమర్థవంతంగా ఆరోగ్య మహిళ

కరీంనగర్‌: ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ సూచించారు. ఆరోగ్య మహిళ హెల్త్‌క్యాంపుల్లో స్క్రీనింగ్‌ చేసిన అందరిని రీస్క్రీనింగ్‌ చేస్తూ ఫాలోఅప్‌ చేయాలన్నారు. గురువారం సప్తగిరికాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం, పద్మనగర్‌ బస్తీ దవాఖానాను సందర్శించారు. ఆస్పత్రుల్లో హాజరు రిజిస్టర్‌, అవుట్‌ పేషెంట్‌, ఎన్‌సీడీ రిజిస్టర్‌, ఫార్మసీ స్టోర్స్‌ను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక రక్తపోటు, డయాబెటిక్‌ వ్యాధిగ్రస్తులు ప్రభుత్వం సరఫరా చేసే మందులనే వాడేలా ప్రోత్సహించాలన్నారు. ప్రజలకు వడ దెబ్బ గురించి వివరించాలన్నారు. గర్భిణులకు చెకప్స్‌, అభాకార్డుల క్రియేషన్‌ సంఖ్య పెంచాలన్నారు. పీవో ఎంహెచ్‌ఎన్‌ సన జవేరియా, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సఫీర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement