కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ సూర్యనగర్‌లోని అల్ఫోర్స్ మహిళా డిగ్రీ, పిజి కళాశాలలో గ్రాడ్ గురు ఇన్నోవేషన్స్ కంపెనీ ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. 150 మంది విద్యార్థినులు పాల్గొనగా, 40మంది బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపికై నట్లు అల్ఫోర్స్ మహిళా డిగ్రీ, పిజి కళాశాల కరస్పాండెంట్ వి.ర వీందర్‌రెడ్డి తెలిపారు. విద్యార్థుల వార్షిక వేతనం రూ.3 లక్షల నుంచి రూ.6లక్షల వరకు ఉంటుందన్నారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులకు ఉత్తమ ప్లేస్‌మెంట్ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రాడ్‌గురు సంస్థ సీనియర్ మేనేజర్ ఆర్తి చౌదరి, మేనేజర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.


