ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూల ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూల ఫలితాలు

May 1 2026 6:03 AM | Updated on May 1 2026 6:03 AM

కరీంనగర్‌: ఐదురాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ ఎ లా ఉన్నా క్షేత్రస్థాయిలో బీజేపీకి ఉన్న రిపోర్టు, అంచనాలకు అనుగుణంగా గణనీయ విజయాలు సా ధిస్తుందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ పార్లమెంట రీ కమిటీ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు. గురువా రం కరీంనగర్‌లోని ఓ హోటల్‌లో మాట్లాడుతూ తె లంగాణ రాజకీయాల్లో మార్పునకు నాంది పలికేలా ఈ నెల 10న మనప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్నారని, ఈ సందర్భంగా ఏర్పాటు చేసే భారీ బహిరంగసభను విజయవంతం చేయాలని కోరా రు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌ పార్టీ ఫెయిల్యూ ర్‌ గవర్నమెంట్‌ అని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు ప్రజలు వీఆర్‌ఎస్‌ ఇచ్చారని, ఆ పార్టీ అవుట్‌ డేటెడ్‌దిగా వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరీంనగర్‌లో తొలి మేయర్‌గా బీజేపీ అభ్యర్థి గెలవ డం ప్రజల్లో మార్పునకు సంకేతమన్నారు. మేయ ర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాస్‌గౌడ్‌ ఉన్నారు.

కాంగ్రెస్‌ ఫెయిల్యూర్‌ గవర్నమెంట్‌

బీఆర్‌ఎస్‌ అవుట్‌ డేటెడ్‌ పార్టీ

10న మోదీ సభ ద్వారా తెలంగాణకు దిశా నిర్దేశం

ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌

Advertisement
 
Advertisement
Advertisement