బీ–థర్మల్‌లో ఊసేలేని తుక్కు వేలం | - | Sakshi
Sakshi News home page

బీ–థర్మల్‌లో ఊసేలేని తుక్కు వేలం

May 1 2026 6:03 AM | Updated on May 1 2026 6:03 AM

రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని బీ–థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం మూతపడి జూన్‌ 4వ తేదీకి రెండేళ్లు పూర్తికానుంది. 1971 అక్టోబర్‌లో ప్రారంభమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 18,743 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి చేసింది. అనేక రికార్డులు సాధించింది. దీనిస్థానంలో త్వరలోనే 800 మెగావాట్ల సామర్థ్యంతో సూపర్‌ క్రిటికల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు కానుంది. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. బీ– థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోని తుక్కు వేలం వేసి.. అదేస్థలంలో కొత్త కరెంట్‌ యూనిట్‌ స్థాపనకు శంకుస్తాపన చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది.

కన్సల్టెన్సీల నియామకం లేదు..

తుక్కు వేలం నిర్వహణకు తొలుత వివిధ విభాగాల ఇంజినీర్లు ఆయా పరికరాల విలువ అంచనా వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సుమారు రెండు నెలల సమయం పడుతుంది. అంచనా నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలి. తుక్కు వేలానికి టెండర్‌ ప్రకటన జారీచేయాల్సి ఉంటుంది. తుక్కు విక్రయించే ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు ఏడాది పట్టే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కానీ, ఇప్పటివరకు కన్సల్టెన్సీల నియామకం చేయలేదు.

ఇంకా నియామకం కాని అంచనా వ్యయ కన్సల్టెన్సీలు

Advertisement
 
Advertisement
Advertisement