కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని పెండింగ్ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సూ చించారు. మంగళవారం ఇంజినీరింగ్ అధికా రులతో సమీక్ష నిర్వహించారు. డివిజన్లలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేసి, టెండర్ పూర్తి చేయాలన్నారు. డ్రైనేజీ కల్వర్టుల సిల్ట్ తొలగింపు, హై లెవల్, లో లెవల్‌లో తాగు నీటి సరఫరా లో ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నా రు. వీధి దీపాలు వెలిగేలా చూడాలని, మరమ్మతులు చేయాలన్నారు.
స్వీయ గణనపై అవగాహన పెంచాలి
స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన పెంచాల ని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. జనగణన పోర్టల్‌లో తమ వివరాలను సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేశారు. జనగణన ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్, ఎస్‌ఈ రాజ్ కుమార్, టౌన్ ప్లానింగ్ డీసీ పి.బషిరొద్దీన్ పాల్గొన్నారు.
రూపాయి అంత్యక్రియలకు నిబంధనల సాకు
కరీంనగర్ కార్పొరేషన్: నిరుపేదల ఆఖరి ప్రయాణానికి అండగా నిలిచిన ’అంతిమ యాత్ర– ఆఖరి సఫర్’ పథకం ఇప్పుడు వివా దాలకు వేదికై ంది. మానవత్వంతో మొదలైన ఈ గొప్ప పథకాన్ని అధికారులు నిబంధనల పేరుతో సామాన్యులకు దూరం చేస్తున్నారా అనే అనుమానాలకు రెండు రోజులుగా జరిగిన ఘటనలు బలం చేకూరుస్తున్నాయి. రెండు రోజుల క్రితం 35వ డివిజన్‌కు చెందిన వ్యక్తి మరణిస్తే, స్థానిక ఆధారం లేదని అధికారులు నిరాకరించడం, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్ గొడవ చేయడం, ఆయనపై పోలీసు కేసు కావడం తెలిసిందే. తాజాగా 7వ డివిజన్ హౌసింగ్‌బోర్డుకాలనీలో వీరబ్రహ్మేంద్ర అనాథాశ్రమంలో వృద్ధుడు మరణిస్తే, సోమవారం సాయంత్రం అంత్యక్రియలు జరగాల్సి ఉండగా, గుర్తింపు కార్డులు లేవంటూ అధికారులు అడ్డు చెప్పారు. స్థానిక కార్పొరేటర్ ఆకుల నందిని ఉదయ్ అనాథకు గుర్తింపు కార్డులు ఏమిటని, తమను కూడా గొడవ చేయమంటారా అంటూ పలుమార్లు హెచ్చరించడంతో మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తి చేశారు.
కరీంనగర్ అర్బన్: ఏళ్లుగా ఉద్యోగుల నిరీక్షణ, పడిగాపులకు చెక్ పడాలంటే సంఘటిత గళంతో ముందుకు సాగాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ(టీఈజేఏసీ) రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలన్నీ జేఏసీ నీడలో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. మంగళవారం జేఏసీ భాగస్వామ్యపక్షాలతో స్థానిక టీఎన్జీ వో భవన్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు. టీఈజేఏసీ ఆధ్వర్యంలో మే 5న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జి ల్లాల కలెక్టరేట్ల ఎదుట నిర్వహించనున్న ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని, అనేక కీలక సమస్యలు సంవత్సరాలుగా పెండింగ్‌లోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన డీఏలు, సంవత్సరానికి ఒకసారి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు, ఐదు సంవత్సరాలకు ఒకసారి అమలు చేయాల్సిన పీఆర్సీ వంటి హక్కులను కాలానుగుణంగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఓపీఎస్ పునరుద్ధరణపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, సీపీఎస్ రద్దుపై ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ దారం శ్రీనివాస్‌రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళిచరణ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి కటకం రమేశ్, పెండ్యాల కేశవరెడ్డి, వివిధ ఉపాధ్యా య, ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.


