పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోళ్లు

Apr 29 2026 8:00 AM | Updated on Apr 29 2026 8:00 AM

● ప్రభుత్వ పథకాల అమలుకు కార్యకర్తలతో కమిటీలు ● మంత్రి పొన్నం ప్రభాకర్‌

సైదాపూర్‌: పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీసంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం సైదాపూర్‌లోని విశాల సహకార సంఘం ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం, మండల పరిషత్‌ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కొత్త నిబంధనలు ఇబ్బందిగా ఉన్నాయని, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ, ఇప్పటివరకు తూకం వేయలేదని, అకాల వర్షాలతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని కార్యకర్తలు మంత్రి దృషికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఽపాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న విద్యా, ఆరోగ్య, అభివృద్ధి కమిటీలతో అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ప్లాస్టిక్‌ నిషేధాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని, మహిళా సంఘాలకు పంపిణీ చేసిన స్టీలు పాత్రలు వాడాలన్నారు. మండలంలోని పలు గ్రామాలకు మంజూరు కావాల్సిన సీసీరోడ్లు, అంతర్గత రోడ్ల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ చిత్రా మిశ్రా, అడిషనల్‌ కలెక్టర్‌ అశ్వినీ తానాజీ వాకడే, అడిషనల్‌ కలెక్టర్‌(రెవెన్యూ) శ్రీనివాసరెడ్డి, డీఆర్‌డీవో శ్రీధర్‌, ఆర్డీవో రమేశ్‌బాబు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దొంత సుధాకర్‌, తహసీల్దార్‌ గుర్రం శ్రీనివాస్‌, ఎంపీడీవో యాదగిరి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement