కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బీఎల్‌ఏ నియామకాలు పూర్తి చేయాలని డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ ప్రక్రియ ద్వారా దళితులు, మైనార్టీల ఓట్లు తొలగించే క్రుట జరుగుతోందన్నారు. సర్పంచ్‌ల్లో అధిక స్థానాలు గెలిచినా, కార్పొరేషన్‌లో అనుకున్న స్థానాలు పొందలేకపోయామన్నారు. బీఎల్‌ఏలు తమ బూత్‌ల పరిధిలో అర్హుల ఓటు తొలగించకుండా చూసుకోవచ్చన్నారు. చొప్పదండి, హుజురా బాద్ మానకొండూరు నియోజకవర్గాల్లో బీఎల్‌ఏ నియామకం పూర్తయిందని, కరీంనగర్‌లో బుధవారం లోగా పూర్తి చేయాలన్నారు.


