నూతన కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

నూతన కార్యవర్గం

Apr 29 2026 8:00 AM | Updated on Apr 29 2026 8:00 AM

కరీంనగర్‌ సిటీ: శాతవాహన యూనివర్సిటీ కాంట్రాక్ట్‌ టీచర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (ఎస్‌యూసీటీఏ) నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన సమావేశంలో అధ్యాపకులు సంఘం ప్రతినిధులను ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డాక్టర్‌ ఎం. మనోజ్‌ కుమార్‌, జనరల్‌ సెక్రటరీగా డాక్టర్‌ జి. రమేశ్‌ రెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్స్‌గా డాక్టర్‌ డి. విజయ్‌ కుమార్‌, అనిల్‌ కుమార్‌, జాయింట్‌ సెక్రటరీస్‌ డాక్టర్‌ టి.కృష్ణకుమార్‌, వి.ప్రదీప్‌ రాజ్‌, కోశాధికారిగా కె. తిరుపతిని ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా, కాలేజీ ఇన్‌చా ర్జిలుగా డాక్టర్‌ కె. రాజు, డి.విజయ్‌ ప్రకాష్‌, జె.అశ్విని, కె.సావిత్రి, వై. ప్రసాద్‌ ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా డాక్టర్‌ ఏ.రవి కుమార్‌, ఎస్‌.కిరణ్‌, ఎం.అర్జున్‌ గౌడ్‌, కె. తిరుపతి రెడ్డి, డి. యశ్వంత్‌ రావును ఎన్నుకున్నారు. అనంతరం శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్‌ను కలవగా నూతన కార్యవర్గాన్ని అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement