చందుర్తి(వేములవాడ): మండలంలోని సనుగుల గ్రామంలో మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని పలువురి పండ్ల చెట్లు, వరిపొలం దెబ్బతిన్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. పిట్టల సత్తవ్వకు చెందిన మామిడి చెట్లు, సనుగుల హన్మాండ్లకు చెందిన అరటి, ఎండీ రజాక్ వరిపొలం మంటలకు దెబ్బతిన్నాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై వరిపొలంలో మంటలను ఆర్పివేశారు. మంటలు అదుపులోకి రాకుంటే పండ్ల తోటల పక్కనే ఉన్న ఇళ్లకు నిప్పు అంటుకుని భారీగా నష్టం జరిగేదని గ్రామస్తులు తెలిపారు.


